లిఫ్ట్‌లను నడిపి పండ్ల తోటలను రక్షించాలి
నాగార్జున సాగర్ ఆయకట్టులో వెంటనే లిఫ్ట్‌లను నడిపించి ఎండిపోతున్న పండ్ల తోటలను రక్షించాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
- లిఫ్ట్‌లు, తూముల కింద యుద్ధ ప్రాతిపదికన చెరువులను నింపాలి
- మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
మిర్యాలగూడ, ఏప్రిల్ 5: నాగార్జున సాగర్ ఆయకట్టులో వెంటనే లిఫ్ట్‌లను నడిపించి ఎండిపోతున్న పండ్ల తోటలను రక్షించాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మిర్యాలగూడ పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్‌రావు, తిప్పన విజయసింహారెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్లనే రాష్ట్రంలో కరువు తీవ్ర పెరిగిందని అన్నారు. ఎడమకాల్వ లిఫ్ట్‌లు, తూముల ద్వారా యుద్ధ ప్రాతిపదికన చెరువులను నింపాలన్నారు.
నీరు లేక ఎండిపోతున్న లక్షల ఎకరాల పండ్ల తోటలను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సాగర్ జలాశయంలో నీరు ఉన్నా వాటిని ఉపయోగించుకోకుండా రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందన్నారు. రైతులు ఎకరాకు రూ.20 నుంచి రూ.30 వేల పెట్టుబడులు పెట్టి వరి సాగు చేశారని, నీరు లేక పంటలు ఎండిపోయాయని, పెట్టిన పెట్టుబడి సైతం రాక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండిన పొలాలను పరిశీలించేందుకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కరీంనగర్, జనగాం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాలో పర్యటించగానే ప్రభుత్వానికి వణుకు పుట్టి వెంటనే కాళేశ్వరం నీటిని ఎత్తిపోయించడం, ఎస్ఆర్ఎస్పీకి నీటిని వదలారని తెలిపారు.
జిల్లా మంత్రుల తెలివి తక్కువతనంతో పాలేరుకు నీరు
జిల్లా మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేతగాని, తెలివి తక్కువ తనం వల్ల మన జిల్లాకు నీరు ఇవ్వకుండా ఖమ్మం జిల్లా పాలేరుకు నీటిని తీసుకెళ్లారని ఆరోపించారు. ఇప్పుడు కూడా మన జిల్లాకు నీరు ఇవ్వకుండా మళ్లీ రెండోసారి పాలేరు రిజర్వాయర్‌ను నింపేందుకు నీటిని తీసుకెళ్తున్నారని, ఎడమకాల్వపై ఉన్న విద్యుత్ లైన్లు నిలిపివేసి లిఫ్టులకు జంపర్లు కట్ చేసి మేజర్లు అన్ని సీజ్ చేశారని, ఇది జిల్లా ప్రజల నోరు కొట్టడమేనని విమర్శించారు. జిల్లాలో ప్రజలు తాగునీరు లేక ఇప్పటికే చాలా గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీరు తెచ్చుకునే పరిస్థితి దాపురించిందన్నారు. జిల్లా మంత్రులకు సోయి ఉంటే ఇప్పటికైనా ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో 41 లిఫ్టులకు వెంటనే నీటిని వదిలి చెరువులు, కుంటలను నింపాలని డిమాండ్ చేశారు. గోదావరి నది నుంచి వంద టీఎంసీ నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నా కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు.
ప్రతిపక్షాలను విమర్శించడమే సీఎం పని
ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాటి నుంచి ముఖ్యమంత్రి, మంత్రులు ఎక్కడి నుంచి వసూలు చేయాలి, ఎప్పుడు ఢిల్లీకి పంపాలి అనే తపనతోనే ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ముఖ్యమంత్రి ఎంతసేపూ ప్రతిపక్షాలను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా శనివారం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు, దీక్షలు చేపట్టనున్నట్లు, దీనికి రైతులు, బీఆర్ఎస్ అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలి రావాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నామిరెడ్డి యాదగిరిరెడ్డి, మట్టపల్లి సైదులుయాదవ్, రవినాయక్, హాతీరాం, నర్సింహారెడ్డి, చౌగాని భిక్షం, ఎండీ.షోయబ్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

