ధరలపై పెంపుపై తాళ్లతో ఆటో లాగి నిరసన
పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే ఉప సంహరించుకోవాలని, ప్రజలపై భారం పడకుండా చూడాలని సిఐటియు నల్లగొండ జిల్లా కార్యదర్శి ఎండీ.సలీం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం నలగొండ జిల్లా కేంద్రంలో పెట్రోల్, డీజిల్ ధరలను..
నల్లగొండ, మే 15 : పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే ఉప సంహరించుకోవాలని, ప్రజలపై భారం పడకుండా చూడాలని సిఐటియు నల్లగొండ జిల్లా కార్యదర్శి ఎండీ.సలీం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం నలగొండ జిల్లా కేంద్రంలో పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచడానికి వ్యతిరేకిస్తూ సిఐటియూ ఆధ్వర్యంలో ఆటోని తాడుతో లాగుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ పెంచిన పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే ఉప సంహరించుకోవాలని ఈ ధరలు పెరగడం ద్వారా సామాన్య ప్రజలపై భారం పెరిగే అవకాశం ఉందన్నారు.
గతంలో కేంద్ర మంత్రులు మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో ఎటువంటి భారాన్ని ప్రజలపై వేయమని, ధరలు పెంచబోమని మాటలు చెప్పి పది రోజులు కాకుండానే వెంటనే గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను అమాంతం పెంచుతూ ప్రజల నడ్డి విరిచే విధంగా కేంద్ర ప్రభుత్వ వ్యవస్థ ఉన్నదని అన్నారు. డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెరగడం ద్వారా నిత్యవసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందని వెంటనే ధరలు తగ్గించి పేద ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియూ జిల్లా నాయకులు బాణాల పరిపూర్ణ చారి, భీమగాని గణేష్, పోలే సత్యనారాయణ, అద్దంకి నరసింహ, బొల్లు రవీందర్, బొట్టు శివ, పిన్నపరెడ్డి మధుసూదన్ రెడ్డి, శ్రీశైలం, శంకర్, రఘు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders Attack | ఫేస్బుక్ మెటా ఆఫీస్ పై కాంగ్రెస్ నాయకుల దాడి
Hyderabad | నీటి ట్యాంకు నుంచి వృథాగా పోతున్న తాగునీరు..
Enugula Rakesh Reddy | యూత్ డిక్లరేషన్ పేరుతో యువతను మోసం చేసిన కాంగ్రెస్ : ఏనుగుల రాకేష్‌రెడ్డి
Road Accident | ఆటో బోల్తా..ఐదుగురికి గాయాలు
Sensational Comments | రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు.. సోనియాగాంధీకి సీనియర్ నాయకుడు లేఖ
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

