ఐదేండ్ల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయాలి : డిప్యూటీ డీఎంహెచ్ఓ చంద్రశేఖర్
పెన్‌పహాడ్ మండలం సింగారెడ్డిపాలెంలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని సూర్యాపేట జిల్లా ఉప ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ గాజుల చంద్రశేఖర్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. కేంద్రంలో నిర్వహిస్తున్న వివిధ ఆరోగ్య కార్యక్రమాలను, వాటికి సంబంధించిన రికార్డులను..
పెన్‌పహాడ్, జూన్ 24 : పెన్‌పహాడ్ మండలం సింగారెడ్డిపాలెంలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని సూర్యాపేట జిల్లా ఉప ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ గాజుల చంద్రశేఖర్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. కేంద్రంలో నిర్వహిస్తున్న వివిధ ఆరోగ్య కార్యక్రమాలను, వాటికి సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా వ్యాధి నిరోధక కార్యక్రమాల నిర్వహణ, అసంక్రమిత వ్యాధుల నివారణ కార్యక్రమానికి సంబంధించిన స్క్రీనింగ్ వివరాలు, ఆన్లైన్ ఫాలో-అప్ రికార్డులను ఆయన తనిఖీ చేశారు. రికార్డుల నిర్వహణ, ఆన్లైన్ నమోదు ప్రక్రియను నిరంతరం అప్డేట్ చేయాలని సిబ్బందిని ఆదేశించారు.
ఈ నెల 28వ తేదీ (ఆదివారం) జరగబోయే పల్స్ పోలియో కార్యక్రమ ఏర్పాట్లపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. పోలియో కార్యక్రమానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ వివరాలను పరిశీలించి, ఐదేళ్లలోపు పిల్లలందరికీ నూటికి నూరు శాతం పోలియో చుక్కలు అందేలా చూడాలని సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. ఈ విషయంలో ఎలాంటి అజాగ్రత్త వహించరాదని, క్షేత్రస్థాయిలో మైక్రో యాక్షన్ ప్లాన్ ప్రకారం పని చేయాలని తగు సూచనలు జారీ చేశారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫీమేల్ హెల్త్ అసిస్టెంట్లు జయశ్రీ, నాగలక్ష్మి, ఆశా కార్యకర్తలు ఇందిర, నాగలక్ష్మి, నాగమ్మ, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

