‘ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుదాం’
కార్మిక కర్షక మైత్రితో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు నిర్వహిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుందామని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి, నల్లగొండ జిల్లా కార్యదర్శి ఎండి సలీం పిలుపునిచ్చారు.
– ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకుందాం
– ఈ 15న జరిగే బహిరంగ సభను జయప్రదం చేయండి
– సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి పిలుపు
నల్లగొండ, నవంబర్ 11 : కార్మిక కర్షక మైత్రితో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు నిర్వహిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుందామని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి, నల్లగొండ జిల్లా కార్యదర్శి ఎండి సలీం పిలుపునిచ్చారు. బుధవారం భారత ఆహార సంస్థ హమాలి వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) నల్లగొండ ఆధ్వర్యంలో ఈ నెల 15న జరుగు రైతు మహాసభ సందర్భంగా బహిరంగ సభను జయప్రదం చేయాలని సిఐటియు కార్యాలయం నుండి మైసయ్య విగ్రహం, ప్రకాశం బజార్ ఎగ్బాల్ మినార్, మిర్యాలగూడ రోడ్డు మీదుగా కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పాలని చేస్తున్న కుట్రలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. నవంబర్ 15 నుండి 18 వరకు నల్లగొండ పట్టణంలో జరుగుతున్న 36వ అఖిల భారత రైతు సంఘం జాతీయ మహాసభ ల సందర్భంగా 15న జరుగు బహిరంగ సభలో కార్మిక వర్గం పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ జిల్లా కార్యదర్శి సయ్యద్ హశం, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు దండెంపల్లి సత్తయ్య, పట్టణ కన్వీనర్ అవుట రవీందర్, జిల్లా కమిటీ సభ్యులు భీమగాని గణేష్, సలివొజు సైదాచారి, ఎఫ్‌సీఐ హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు సుంకరబోయిన వెంకన్న, కోశాధికారి నకరికంటి సత్తయ్య, పట్టణ కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, రాజేష్, రాములు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుదాం’
KTR | కేసీఆర్ ఇదే నిర్మల్ గడ్డ మీద తెలంగాణను తీసుకొస్తా అన్నరు : కేటీఆర్
రైతు వ్యతిరేక విధానాలపై కవులు తమ కలాలను ఎక్కుపెట్టాలి : నందిని సిధారెడ్డి
Girl falls into water tank, 4 Dies | నీటి ట్యాంకులో పడిన బాలిక.. రక్షించే క్రమంలో ఆమెతో సహా నలుగురు మృతి
‘పూర్తిస్థాయి బోనస్ చెల్లించే వరకు ఆందోళన విరమించేది లేదు’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

