నల్లగొండ : కేంద్ర ప్రభుత్వం ఓటర్లను నమోదుపై తీసుకువచ్చిన సర్ ప్రక్రియలో తొలగించిన అర్హులైన ఓటర్లందరినీ వెంటనే చేర్చాలని డిమాండ్ చేస్తూ పలు పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.
సర్ ప్రక్రియను ఆపివేయాలని, కేంద్ర ఎన్నికల సంఘం స్వయంపతిని కాపాడాలని జ్ఞానేష్ కుమార్ ను తొలగించాలని డిమాండ్ చేస్తూ నల్గొండలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద వామపక్ష పార్టీలు, టీజిఎస్, ఇతర సంఘాల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన వ్యక్తం చేసారు.
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రం తీరు ప్రజాస్వామ్యానికి ముప్పు కలగించేదిగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లి కంటి సత్యం, సిపిఎం జిల్లా కార్యదర్శి వీరారెడ్డి, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.