భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
ఎన్నో సంవత్సరాలుగా రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను త్వరలోనే పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. శుక్రవారం చందంపేట మండలంలోని పొగిళ్ల, కంబలాపల్లి గ్రామాల్లో ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి...
– వాస్తవ రైతులను గుర్తుంచి పట్టాలు ఇస్తాం
– పొగిళ్ల, కంబలాపల్లి గ్రామాల్లో క్షేత్రస్థాయి పర్యటన
– రైతులతో సమావేశం
చందంపేట, అక్టోబర్ 23 : ఎన్నో సంవత్సరాలుగా రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను త్వరలోనే పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. శుక్రవారం చందంపేట మండలంలోని పొగిళ్ల, కంబలాపల్లి గ్రామాల్లో ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులతో ప్రత్యేక సమావేశం నిర్యహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూ సమస్య ఉన్న గ్రామంలో ఇప్పటికే సర్వే అధికారులు సర్వే చేశారని, ఇంకా మిగిలిన భూములకు సర్వే చేసి వాస్తవ రైతులకు భూ పట్టాలు ఇస్తామని తెలిపారు. పొగిళ్ల, కంబలాపల్లి గ్రామాల్లో ప్రభుత్వం భూమి, అటవీ భూమి వేర్వేరు చేసి భూ పట్టాలు కలిగిన రైతులకు న్యాయం చేస్తామని చెప్పారు.
త్వరలో ఎంజాయ్మెంట్ సర్వే ఆధారంగా రెవెన్యూ అధికారుల రికార్డు పరిశీలించి పాస్ బుక్ లు అందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మండలంలోని భూ సమస్య ఉన్న రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. అనంతరం కంబాలపల్లిలో రైతు వేదికలో రైతులతో సమావేశం నిర్వహించారు. భూ సర్వే చేసేప్పుడు అధికారులకు సహకరించాలని కోరారు. ఆయన వెంట స్పెషల్ కలెక్టర్ శ్రీనివాస్, సబ్ కలెక్టర్ కరోలియన్ సింగ్ తియాన్ మావి, తాసీల్దార్ సత్యనారాయణ గౌడ్, సర్పంచులు గోవింద యాదవ్, జయిందర్ నాయక్, ఇతర అధికారులు ఉన్నారు.

భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

