రైతుల సమస్యలు పరిష్కరించాలి
పండించిన పంట అమ్ముకోవడానికి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని, రైతుల సమస్యలు తీర్చే బాధ్యత ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిదేనని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఆయన ఒక్క రోజు కూడా రైతుల సమస్యలు తెలుసుకోవడానికి క్షేత్రస్థాయిలో పర్యటించాడా అని ప్రశ్నించాడు.
- ఆ బాధ్యత ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిదే..
- ఆయన అధికార పక్షమా.. ప్రతిపక్షమా ప్రకటించాలి
- మీడియాతో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి
చండూరు, మే 1: పండించిన పంట అమ్ముకోవడానికి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని, రైతుల సమస్యలు తీర్చే బాధ్యత ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి దేనని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఆయన ఒక్క రోజు కూడా రైతుల సమస్యలు తెలుసుకోవడానికి క్షేత్రస్థాయిలో పర్యటించాడా అని ప్రశ్నించాడు. ప్రభుత్వం, కలెక్టర్, లారీ యాజమాన్యంతో మాట్లాడాలని సూచించారు. రాజగోపాల్‌రెడ్డివి మాటలు తప్ప ఎవరికీ పనిచేయరన్నారు. ఆయన ప్రజలను, ప్రభుత్వాన్ని, నాయకులను బ్లాక్మెయిల్ చేసుకుంటూ బతుకుతున్నాడని ఆరోపించారు.
యూరియా దొరకక రైతులు ఇబ్బందులు పడినప్పుడు, పత్తి కొనుగోలుకు యాప్ పెట్టినప్పుడు ఆయన మంత్రి పదవి కోసం పాకులాడారు..తప్ప రైతుల కోసం ఏనాడూ మాట్లాడలేదని ఎద్దేవా చేశారు. ఈ ప్రాంత ప్రజలు ఎన్నో ఆశలతో గెలిపిస్తే వారిని మరిచి.. తన పనులు మాత్రం చేసుకుంటున్నాడని కుసుకుంట్ల పేర్కొన్నారు. వారం రోజుల్లో రైతుల సమస్యలు పరిష్కరించకుంటే రైతుల పక్షాన బీఆర్ఎస్ ఆధ్వర్యంలో 5వేల మంది రైతులతో మహాధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. రైతులపై అంత ప్రేమ ఉంటే బీఆర్ఎస్ నిర్వహించే ధర్నాలో మాతోపాటే కూర్చోవాలని సవాల్ చేశారు. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఎన్నికలప్పుడు తప్ప నియోజకవర్గంలో ఇంత వరకు జాడలేడని, ఆయనకు పదవుల మీద ఉన్న ధ్యాస తనను గెలిపించిన ప్రజల మీద లేదన్నారు.
ఆయన అధికార పక్షమా.. ప్రతిపక్షమా..తెలియకుండా అటు ఇటు కాని ఎమ్మెల్యేగా తీరుగుతాడు తప్ప…మునుగోడు ప్రజలకు ఏమీ చేయడని పేర్కొన్నారు. అంతకుముందు మేడే సందర్భంగా చండూరు పట్టణ కేంద్రంలో బీఆర్టీయూ చండూరు పట్టణ మాజీ అధ్యక్షుడు చొప్పరి దశరథ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత మండల పరిధిలోని గుండ్రపల్లిలోని ధ్యానం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతులకు కష్టాలు తప్ప ఏమిలేదని ఆవేదన వ్యక్తం చేశారు.రైతులు ధ్యాన్యాని కొనుగొలు కేంద్రాలను తెచ్చి నెల రోజులు గడస్తున్నా రైతుల కష్టాలు కనిపిస్తాలేవా అని ప్రశ్నించారు. .ప్రభుత్వం ఎప్పుడు కొనుగోలు చేస్తుందో తెలియక రైతులు అయోమయంలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒకవేళ ధాన్యం అమ్మినా క్వింటాకు 6 నుంచి 8 కిలోల ధాన్యాన్ని దోపిడీ చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్మిక విభాగం మాజీ జిల్లా అధ్యక్షులు గుర్రం వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీపీ తోకల వెంకన్న, మాజీ మండల అధ్యక్షుడు బొమ్మరబోయిన వెంకన్న, పెద్దగోని వెంకన్న, నాయకులు ఎత్తపు మధుసూదన్‌రావు, అన్నెపర్తి శేఖర్, కురుపాటి సుదర్శన్, బొడ్డు సతీష్ గౌడ్, కౌన్సిలర్లు తేలుకుంట్ల రాజకుమారి, సామ సుజాతాయాదవరెడ్డి, కొండ్రెడ్డి మధు, సర్పంచ్‌లు ఉజ్జిని ఉషాఅనిల్రావు, గాలెంక రాంబాబు, నారపాక వసంత దనయ్య, నందికొండ నర్సిరెడ్డి, పల్లె నాగార్జున, ఇరిగి రామన్న, గండూరి జనార్దన్ పాల్గ్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oppo F35 | ఒప్పో నుంచి ఎఫ్35, ఎఫ్35 ప్రో ఫోన్లు విడుదల.. అక్టోబర్ 11 నుంచి సేల్
Electrocution | విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి
KTR | రైతుల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది.. గజ్వేల్ ఎమ్మార్వోపై కేటీఆర్ ఆగ్రహం
గరీబ్‌పేట గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

