‘బీసీ ఉద్యమ నేత గుజ్జ సత్యంకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలి’
బీసీల హక్కుల సాధన కోసం సుదీర్ఘకాలంగా ఉద్యమిస్తూ, విద్యా, వైద్య రంగాల్లో రెండు దశాబ్దాలుగా సామాజిక సేవలందిస్తున్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు, బీసీ జేఏసీ రాష్ట్ర సమన్వయకర్త గుజ్జ సత్యం (గుజ్జ సత్యనారాయణ)కు తెలంగాణ శాసనమండలిలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని...
– బీసీల హక్కుల కోసం సుదీర్ఘ పోరాటం
– విద్యా, వైద్య రంగాల్లో రెండు దశాబ్దాలుగా సేవలు
– జాతీయ బీసీ సంక్షేమ సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ
నల్లగొండ రూరల్, అక్టోబర్ 09 : బీసీల హక్కుల సాధన కోసం సుదీర్ఘకాలంగా ఉద్యమిస్తూ, విద్యా, వైద్య రంగాల్లో రెండు దశాబ్దాలుగా సామాజిక సేవలందిస్తున్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు, బీసీ జేఏసీ రాష్ట్ర సమన్వయకర్త గుజ్జ సత్యం (గుజ్జ సత్యనారాయణ)కు తెలంగాణ శాసనమండలిలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. బీసీ ఉద్యమ నేత ఆర్. కృష్ణయ్య అడుగుజాడల్లో నడుస్తూ బీసీల హక్కుల కోసం గుజ్జ సత్యం నిరంతరం పోరాడుతున్నారని తెలిపారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన రాజకీయ ప్రాతినిధ్యం, కులగణన, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, విద్యా, ఉద్యోగ అవకాశాలు, స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల వంటి అంశాలపై ఆయన చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
గత 20 సంవత్సరాలుగా విద్యారంగంలో సేవలందిస్తూ పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు గుజ్జ సత్యం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. సత్యం హోమియోపతి ద్వారా సామాన్య ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్నారని తెలిపారు. పద్మశాలి సమాజానికి చెందిన ఆయన చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం, వృత్తి పరిరక్షణ, ఉపాధి భద్రత కోసం కూడా కృషి చేస్తున్నారని అన్నారు. బీసీ ఉద్యమంలో సుదీర్ఘ అనుభవం, సామాజిక సేవా దృక్పథం కలిగిన గుజ్జ సత్యంకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తే బీసీలు, పేద విద్యార్థులు, చేనేత కార్మికులు, సామాన్య ప్రజల సమస్యలను శాసనమండలిలో బలంగా వినిపించేందుకు అవకాశం ఉంటుందని లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు.
గుజ్జ సత్యం సేవలను, ఉద్యమ ప్రస్థానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిగణనలోకి తీసుకుని గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవికి ఆయన పేరును సిఫారసు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, బెస్త సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు, పెండెం ధనుంజయ, జిల్లా కోశాధికారి జేరిపోతుల రమేష్ గౌడ్, పట్టణ అధ్యక్షులు పుట్ట ఎంకన్న గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు వెంకన్న యాదవ్, యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపోయిన సతీష్ యాదవ్, పగిళ్ల కృష్ణ, కస్తూరి రవీందర్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health | మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే 5 పోషక లోపాలు.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
‘బీసీ ఉద్యమ నేత గుజ్జ సత్యంకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలి’
CJP protest | సీజేపీ నిరసన.. రాత్రి నుంచి సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నెట్ సేవలు బంద్
Navaratri Brahmotsavams | నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలి : టీటీడీ అదనపు ఈవో
పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి : ఎస్పీ రోహిత్ రాజు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

