రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలి : మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
ఎల్‌నినో పరిస్థితుల దృష్ట్యా రైతాంగం యాసంగిలో ఆరుతడి పంటలను సాగు చేయాలని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం కోదాడ నియోజకవర్గ పరిధిలోని రెడ్లకుంట ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించిన అనంతరం నిర్వహించిన సమావేశంలో...
కోదాడ, నవంబర్ 11 : ఎల్‌నినో పరిస్థితుల దృష్ట్యా రైతాంగం యాసంగిలో ఆరుతడి పంటలను సాగు చేయాలని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం కోదాడ నియోజకవర్గ పరిధిలోని రెడ్లకుంట ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించిన అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అలాగే రైతులు, ప్రజల కోసం అవసరమైన చర్యలన్నీ తీసుకుంటామన్నారు. కృష్ణా, గోదావరి జలాల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు. తెలంగాణలో సాగు విస్తీర్ణం, వరి ఉత్పత్తి, ధాన్యం కొనుగోళ్లు పెరిగినట్లు తెలిపారు. ఈ ఖరీఫ్‌లో చాలా వరకు పంటలను కాపాడగలిగామన్నారు. కోతలు సాగుతున్న ఈ ఖరీఫ్‌లో తెలంగాణలో రికార్డు స్థాయిలో పంటలు పండినట్లు తెలిపారు. రైతు భరోసా, బీమా సహా అన్ని అంశాల్లో రైతుల మేలుకే ప్రాధాన్యం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి, కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలి : మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
Jharkhand Workers Captive In Bihar | ఉపాధి కోసం వెళ్లిన జార్ఖండ్ కార్మికులు.. బీహార్‌లో బందీ, సీఎం జోక్యం
Gautham Ghattamaneni | ‘రామాయణ’ సినిమాకు రివ్యూ ఇచ్చిన గౌతమ్ ఘట్టమనేని.. రేటింగ్ ఎంతంటే?
విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యం : కలెక్టర్ రాహుల్ శర్మ
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఎన్హెచ్ఎంల నిరసన సెగ.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

