పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు ఏర్పాట్లు పూర్తి
వరంగల్ -ఖమ్మం- నల్లగొండ శాసనమండలి పట్టభద్రుల ఉపఎన్నికకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన తెలిపారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని సెయింట్ ఆల్ఫాన్సెస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల సామగ్రి పంపిణీ, రిసెప్షన్ కేంద్రంలో బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సిబ్బంది తరలింపు ఏర్పాట్లను తనిఖీ చేశారు.
- ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ దాసరి హరిచందన
నీలగిరి, మే 23 : వరంగల్ -ఖమ్మం- నల్లగొండ శాసనమండలి పట్టభద్రుల ఉపఎన్నికకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన తెలిపారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని సెయింట్ ఆల్ఫాన్సెస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల సామగ్రి పంపిణీ, రిసెప్షన్ కేంద్రంలో బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సిబ్బంది తరలింపు ఏర్పాట్లను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉప ఎన్నిక జరిగే 12 జిల్లాలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలను కల్పించినట్లు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయాల్సి ఉంటుందని, ఓటు ఎలావేయాలో క్షుణ్ణంగా తెలుసుకోవాలని చెప్పారు. ఇందుకు ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పోస్టర్‌తో పాటు, ఫ్లెక్సీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని ఆమె కోరారు. అనంతరం కలెక్టర్ పోలింగ్ సిబ్బంది బ్యాలెట్ బాక్స్‌లు, ఇతర సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు వెళ్లే బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు జె. శ్రీనివాస్, టి.పూర్ణచంద్ర, నల్లగొండ, మిర్యాలగూడ ,చండూరు, దేవరకొండ ఆర్డీఓలు, నాగిరెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజకుమార్ ఇతర అధికారులు, తాసీల్దార్లు ఉన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

