పుట్టే రోజూ సరి‘కొత్త’గా..
నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టే జనవరి1 చాలా ప్రత్యేకమైంది. ప్రపంచమంతా ఉత్సవాలు జరుపుకొనే రోజు. మరి అలాంటి రోజు శిశువులు జన్మిస్తే మరింకెంతో ప్రత్యేకం.
- జనవరి 1న జన్మించేదెందరో..!
- యూనివర్సల్ పుట్టిన రోజుకు ఆసక్తి చూపుతున్న తల్లిదండ్రులు
- ఒకటో తేదీ వచ్చేలా డెలివరీల్లో మార్పు
- ఉమ్మడి జిల్లాలో డెలివరీకి సిద్ధంగా 359 మంది గర్భిణులు
- రిస్క్ లేనంత వరకు సహకరించొచ్చంటున్న వైద్యులు
సూర్యాపేట, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ) : నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టే జనవరి1 చాలా ప్రత్యేకమైంది. ప్రపంచమంతా ఉత్సవాలు జరుపుకొనే రోజు. మరి అలాంటి రోజు శిశువులు జన్మిస్తే మరింకెంతో ప్రత్యేకం. అలాంటి రోజున పుట్టిన రోజులొస్తే ఎంత బాగుంటుందని చాలా మంది కోరుకుంటుంటారు. అవకాశం ఉన్నంత వరకు ప్రయత్నిస్తుంటారు. తొమ్మిది నెలల క్రితం గర్భం దాల్చిన వారు నెలలు పూర్తి చేసుకొని శాస్త్రీయంగా ఈ రోజున పుట్టేవారు కొంతమంది ఉంటారు.
అలా ఇప్పటికే సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో జనవరి 1న జన్మించే వారి సంఖ్య వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం 119 మంది ఉన్నారు. డిసెంబర్ 31న 124 మంది మహిళలు డెలివరీ కానుండగా జనవరి 2న 116 మంది ఉన్నారు. వీరిలో చాలా మంది రిస్క్ తీసుకొని జనవరి 1నాడే డెలివరీ అయ్యేలా చూడాలంటూ డాక్టర్లను బ్రతిమాలుతున్నట్లు తెలుస్తున్నది. అయితే గర్భంతో ఉన్న మహిళలకు ఆరోగ్య రీత్యా రిస్క్ లేనంత వరకు ఒక్క రోజు తేడాతో అనేది సహకరించవచ్చు కానీ మరిన్ని రోజులు ముందుకు కానీ, వెనక్కి కానీ పోస్టుపోన్ చేయడం కుదరదని డాక్టర్లు అంటున్నారు.
మరి యూనిర్సల్ పుట్టిన రోజు జరుపుకొనేందుకు జనవరి 1, 2024 అయిన ఈ రోజున ఎంత మంది శిశువులు బాహ్య ప్రపంచంలోకి వస్తున్నారో వేచి చూడాల్సి ఉంది. ఈ మేరకు జనవరి 1కి రెండు రోజుల ముందు, తరువాత డెలివరీ కావాల్సిన మహిళలు జనవరి 1న తమ పిల్లలకు జన్మనిస్తే ఎలా ఉంటుందని ఆలోచన చేసి డాక్టర్లను సంప్రదిస్తున్నారు. రెండు రోజుల గ్యాప్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదని డాక్టర్లు తేల్చి చెబుతుండగా ఒక్క రోజు తేడా కాస్త సహకరించే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
359మందిలో 1ని వరించేదెవరికో..?
జనవరి 1కి ముందు, వెనుక మొత్తం మూడు రోజుల్లో దాదాపు 359 మంది మహిళలు శిశువులకు జన్మనిస్తుండగా ఒకటో తారీఖు ప్రత్యేకత కోసం ప్రయత్నాలు చేస్తున్న వారి సంఖ్య బాగానే ఉన్నట్లు తెలుస్తున్నది. ప్రతిరోజూ అయ్యే డెలివరీల్లో 70శాతం ప్రభుత్వ, 3శాతం ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరుగుతున్నాయి. సూర్యాపేట జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం డిసెంబర్ 31న 53 మంది మహిళలు డెలివరీ అయ్యే అవకాశాలు ఉండగా జనవరి 1న 51 అలాగే జనవరి 2న 42 మంది మొత్తం సూర్యాపేట జిల్లాలో మూడు రోజులు కలిపి 146మంది ఉన్నారు.
అదేవిధంగా నల్లగొండ జిల్లాలో జనవరి 1న జన్మించే వారి సంఖ్య 68మంది ఉన్నట్లు తెలుస్తుండగా ముందు రోజున డిసెంబర్ 31న 71 మంది, తరువాత రోజైన జనవరి 2న 74మంది మూడు రోజుల్లో 213 ప్రసవించనున్నారు. మరి ముందు, వెనుక రోజుల్లో ప్రసవం డేట్ ఉన్న మహిళలు ఎంత మంది జనవరి 1కి మార్చుకుంటారు.. వారి ఆరోగ్య రీత్యా డాక్టర్లు ఎంత మందికి సహకరిస్తారనేది వేచి చూడాల్సి ఉంది.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఎన్నికల వేళ చంద్రబాబు సర్కారు దుర్మార్గాలు చేస్తోంది : పేర్ని నాని
కూలీలు ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలి: జడ్పీ సీఈవో నాగలక్ష్మి
‘టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి’
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

