నిర్మాతలకు కొత్త టెన్షన్.. ‘ఉప్పెన’ తర్వాత తగ్గిన జోరు

భయంకరమైన కోవిడ్ 19 తర్వాత దేశంలో కోలుకున్న సినిమా ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది టాలీవుడ్ మాత్రమే. ఈ విషయాన్ని ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. తమిళ, మలయాళ ఇండస్ట్రీలలో ఇప్పటికీ థియేటర్లు పూర్తిస్థాయిలో ఓపెన్ చేయలేదు. స్టార్ హీరోలు కూడా తమ సినిమాలను డిజిటల్ మీడియాలో విడుదల చేస్తున్నారు. దానికి ప్రత్యక్ష నిదర్శనం మోహన్ లాల్ దృశ్యం 2. పక్క ఇండస్ట్రీల్లో పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే తెలుగులో మాత్రం వరస విజయాలు వచ్చాయి.
సంక్రాంతికి రవితేజ క్రాక్.. విజయ్ మాస్టర్ సినిమాలు కాసుల వర్షం కురిపించాయి. ఆ వెంటనే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, జాంబి రెడ్డి లాంటి సినిమాలు బయ్యర్లకు లాభాలు తీసుకురాకపోయినా నష్టాలు మాత్రం తేలేదు. అలాంటి సమయంలో వచ్చిన ఉప్పెన సినిమా అందరి అనుమానాలు పటాపంచలు చేసింది. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ సినిమా రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేసి తెలుగు సినిమా పూర్తిగా కోలుకుందనే సంకేతాలను దర్శక నిర్మాతలకు పంపించింది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్.
ఉప్పెన సినిమా విడుదలైన తర్వాత వారానికి అరడజను సినిమాల చొప్పున దాదాపు 25 సినిమాలు విడుదలయ్యాయి. అందులో అల్లరి నరేష్ నటించిన నాంది సినిమా మాత్రమే విజయం సాధించింది. ఇది కూడా కేవలం రూ.5 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. మంచి అంచనాలతో వచ్చిన నితిన్ చెక్ దారుణంగా డిజాస్టర్ అయ్యింది. ఈ వారం విడుదలైన సినిమాలలో కూడా ఏ ఒక్క దానికి సరైన రెస్పాన్స్ రావడం లేదు. పర్లేదు బాగానే ఉన్నాయి.. ఓసారి చూడొచ్చు అనే టాక్ తెచ్చుకున్నా షాదీ ముబారక్, A1 Express లాంటి సినిమాలకు కనీసం ఓపెనింగ్స్ కూడా రాలేదు.
దాంతో నిర్మాతలలో మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. పెరుగుతున్న కరోనా కేసులు ప్రేక్షకుల్లో మళ్లీ భయం పుట్టిస్తున్నాయా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఏదేమైనా ఉప్పెన లాంటి సంచలన విజయం తర్వాత అలాంటి మరో బ్లాక్ బస్టర్ వచ్చుంటే ఇలాంటి అనుమానాలు వచ్చి ఉండేవి కావు. మరి మార్చి 11న విడుదల కాబోయే శర్వానంద్ శ్రీకారం, శ్రీ విష్ణు గాలి సంపత్, నవీన్ పొలిశెట్టి జాతిరత్నాలు సినిమాలైనా నిర్మాతల భయాన్ని పోగొట్టి.. నమ్మకాన్ని నిలబెడతాయేమో చూడాలి.
Read Today's Latest Movie-gossips News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

