పాపం ఆ సినిమాను దిల్ రాజు బ్రాండ్ కూడా కాపాడలేకపోయిందిగా..!

కొన్ని సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తుంటాయి. కానీ కలెక్షన్ల రూపంలో మాత్రం అవి కనిపించవు. ఇప్పుడు ఒక సినిమా విషయంలో ఇదే జరుగుతుంది. పైగా అది ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన సినిమా కావడం గమనార్హం. ఆయన బ్రాండ్తో విడుదలైన కూడా థియేటర్ల దగ్గర ఏ మాత్రం సందడి చేయడం లేదు. ఆ చిత్రం పేరు షాదీ ముబారక్. మార్చి 5న విడుదలైన 9 సినిమాల్లో అన్నింటి కంటే బెటర్ టాక్ తెచ్చుకున్న సినిమా ఇదే. కొత్త దర్శకుడు పద్మశ్రీ తెరకెక్కించిన ఈ సినిమాలో చక్రవాకం, మొగలిరేకులు సీరియల్ హీరో సాగర్ నటించాడు.
ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఏ మాత్రం ఉపయోగం లేకుండా పోయింది. తొలి రోజు కనీసం రూ.10 లక్షల షేర్ కూడా వసూలు చేయలేదు షాదీ ముబారక్. దిల్ రాజు లాంటి బడా నిర్మాత విడుదల చేసిన కూడా ప్రేక్షకుల్లో ఏమాత్రం బజ్ క్రియేట్ చేయలేకపోయింది ఈ సినిమా. దాని ఫలితమే కలెక్షన్లు లేకపోవడం. రెండున్నర కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన షాదీ ముబారక్ ఎంత వసూలు చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. మౌత్ టాక్ బయటికి వెళితే తప్ప ఈ సినిమాకు కలెక్షన్లు రావడం కష్టం.
అది వెళ్లేలోగా థియేటర్ల నుంచి సినిమా వెళ్ళిపోతుందేమో అని బయ్యర్లు భయపడుతున్నారు. అయితే ఈ సినిమాను దిల్ రాజు తీసుకున్నాడనే పేరే కానీ ఎక్కడ ప్రమోషన్స్ గట్టిగా చేయలేదు అనేది ప్రధాన అభియోగం. పోనీ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిన తర్వాత అయినా ప్రమోషన్స్ లో వేగం పెరిగిందా అంటే అది లేదు. అందుకే షాదీముబారక్ వసూళ్ల వేటలో భారీగా వెనకబడిపోయింది. టాక్ బాగుంది కాబట్టి త్వరగా ఓటీటీలో విడుదల చేసుకుంటే అక్కడ విజయం సాధిస్తుందని సలహా ఇస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మొత్తానికి నెగిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాలను కూడా తన మార్క్ పబ్లిసిటీతో హిట్ చేసే దిల్ రాజు.. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాని మాత్రం అలా వదిలేశాడేంటి అంటూ గుసగుసలాడుతున్నారు ఆడియన్స్.
Read Today's Latest Movie-gossips News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

