సీరియస్ దర్శకులు అంతా మూకుమ్మడిగా దాడి చేస్తున్నారుగా

తెలుగు ఇండస్ట్రీలో ఆ దర్శకుల దారి విభిన్నం. అందరిలా రొటీన్ కమర్షియల్ సినిమాలు చేయడం వాళ్లకు చేత కాదు. రెండు మూడేళ్లకు ఓ సినిమా చేసినా తమదైన మార్క్ కనిపించేలా ఉంటాయి అవి. అలాంటి సీరియస్ దర్శకులు తెలుగులో కొంతమంది ఉన్నారు. యాదృచ్ఛికంగా ఆ దర్శకుల సినిమాలు ఒకే సీజన్లో విడుదల అవుతున్నాయిప్పుడు. వాళ్లే శేఖర్ కమ్ముల, చంద్రశేఖర్ ఏలేటి, దేవా కట్టా. ఇప్పటికే చంద్రశేఖర్ ఏలేటి తెరకెక్కించిన చెక్ సినిమా మార్చి 26న విడుదలైంది. నితిన్ హీరోగా వచ్చిన ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది.

కెరీర్లో తొలిసారి పూర్తిగా కమర్షియల్ పంథాలో ఒక సినిమా చేయబోయి చేతులు కాల్చుకున్నాడు చంద్రశేఖర్. అయినా కూడా ఈయన నుంచి సినిమా రావడం అతని అభిమానులకు సంతోషాన్ని కలిగించే విషయం. అప్పుడెప్పుడో 2015లో మనమంతా సినిమాతో ప్రేక్షకులను పలకరించిన చంద్రశేఖర్ ఏలేటి.. ఆరేళ్ల విరామం తీసుకొని చెక్ సినిమాతో వచ్చాడు.

ఇక ఇదే సీజన్లో రాబోతున్న మరో విలక్షణ దర్శకుడు శేఖర్ కమ్ముల. ఫిదా లాంటి సంచలన విజయం తర్వాత మూడేళ్లకు పైగా విరామం తీసుకొని లవ్ స్టోరీ సినిమాతో ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు శేఖర్ కమ్ముల. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా విడుదలకు ముందే రూ. 50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

మరోవైపు విలక్షణ సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవా కట్టా రిపబ్లిక్ సినిమాతో జూన్ 4న వస్తున్నాడు. సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని పూర్తి స్థాయి పొలిటికల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు దేవా. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తోంది. ఏదేమైనా ఒకే సీజన్లో చంద్రశేఖర్ యేలేటి, శేఖర్ కమ్ముల, దేవా కట్ట లాంటి ముగ్గురు విలక్షణ దర్శకుల నుంచి సినిమాలు వస్తుండటంతో అభిమానులు కూడా ఆనందంగా ఫీలవుతున్నారు.
ఇవి కూడా చదవండి..
RRR ఫొటోల లీక్: టీంపై రాజమౌళి సీరియస్
ఆర్ఆర్ఆర్ నుండి ఎన్టీఆర్, రామ్ చరణ్ పిక్ లీక్..!
కేజీఎఫ్ 2 హిందీ వెర్షన్ కు యశ్ స్పెషల్ ట్రీట్..!
ఉప్పెన చిత్ర యూనిట్‌కు బన్నీ ప్రశంసలు
అరణ్య అప్డేట్..రానా తండ్రిగా వెంకటేశ్..!
మెగా హీరో సినిమాలో బిగ్ బాస్ భామ..!
Read Today's Latest Movie-gossips News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

