భవిష్యత్తు తరాలకు చెప్పే కథ!

‘రాజ్యాలు, ప్రేమల కోసం గొడవలు పడే కథలు వెండితెరపై చాలా వచ్చాయి. అందుకు భిన్నంగా భూమి, జంతువుల కోసం సమాజాన్ని, ప్రభుత్వాన్ని ఎదురించి పోరాడే ఓ గొప్ప వ్యక్తి కథ ఇది’ అని అన్నారు రానా. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘అరణ్య’. ప్రభు సాల్మన్ దర్శకుడు. ఈ నెల 26న విడుదలకానుంది. ఈసందర్భంగా రానా చెప్పిన సంగతులివి…
‘అరణ్య’ ప్రయాణం ఎలా మొదలైంది?
అడవుల గొప్పతనం ఏమిటో దర్శకుడు ప్రభుసాల్మన్ చెప్పిన ఈ కథ విన్న తర్వాతే అర్థమైంది. మనుషులు, జంతువుల మధ్య నెలకొన్న సంఘర్షణ నేపథ్యంలో ఆసక్తికరంగా ఈ సినిమా సాగుతుంది. యథార్థ ఘటనల స్ఫూర్తితో రూపొందించాం. కజిరంగా అటవీ సమస్యలపై పదేళ్లుగా పోరాడుతున్న ఓ వ్యక్తితో పాటు అడవుల్ని పెంపొందించేందుకు విశేష కృషి చేసిన జాదవ్, ఏనుగులు సంరక్షణ కోసం పాటు పడుతున్న లారెన్స్ ఆంథోనీ ఇలా భిన్న జీవితాల వ్యక్తుల ఆధారంగా తెరకెక్కించాం.
ఇందులో మీ పాత్ర ఎలా సాగుతుంది?
జంతు స్వభావం కలిగిన అరణ్య అనే వ్యక్తిగా నేను ఈ సినిమాలో కనిపిస్తా. ఎక్కువ రోజులు అడవిలో ఉండటం వల్ల జంతువులతోనే స్నేహంగా ఉంటాడతను. మనుషులకు సమస్య వస్తే స్వయంగా వారే పోరాడుతుంటారు. అదే జంతువులకు వస్తే వాటి తరఫున కొందరు వ్యక్తులు ఎలాంటి పోరాటం చేశారన్నది ఆసక్తికరంగా ఉంటుంది.
సందేశాన్ని వాణిజ్య హంగులు మేళవిస్తూ చెప్పడానికి ఎలాంటి కసరత్తులు చేశారు?
. 1970-80 దశకంలో జంతువుల ఇతివృత్తాలతో చాలా సినిమాలొచ్చాయి. ప్రస్తుతం ఆ ధోరణి తగ్గింది. భవిష్యత్తు తరాలకు ఇలాంటి మంచి కథల గురించి చెప్పాల్సిన అవసరం ఉందనిపించింది.. పట్టణీకరణ పేరుతో అడవుల్ని, జంతువుల్ని నాశనం చేసేందుకు కార్పొరేట్ శక్తులు ఎలాంటి కుట్రల్ని పన్నుతున్నాయనేది ఆలోచనను రేకెత్తిస్తుంది.
లాక్డౌన్ తర్వాత ఇండస్ట్రీలో మీరు గమనించిన మార్పులేమిటి?
దేశంలో ఒక్క తెలుగు ఇండస్ట్రీ మాత్రమే కరోనా విపత్తు నుంచి తొందరగా కోలుకుంది. నటీనటుల నుంచి థియేటర్ల వ్యవస్థ వరకు ప్రతి ఒక్కరూ ఐక్యంగా పనిచేయాలని నిర్ణయించుకోవడం, వారికి ప్రేక్షకుల ప్రోత్సాహం లభించడం వల్లే ఇది సాధ్యమైంది.సినిమాను ప్రేమించే తత్వం తెలుగు ప్రేక్షకుల్లో మెండుగా ఉంది. గ్లోబల్ సినిమాల్ని తీసే స్థాయికి హైదరాబాద్ చేరుకోవడం ఆనందంగా ఉంది.
‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ కోసం తొలిసారి పవన్‌కల్యాణ్‌తో పనిచేయడం ఎలా అనిపిస్తోంది?
అమితాబ్‌బచ్చన్, అజిత్, పవన్‌కల్యాణ్ లాంటి గొప్ప నటులతో కలిసి నటించే అదృష్టం నాకు దక్కడం ఆనందంగా ఉంది. ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్‌లో నా పాత్ర ఆసక్తికరంగా ఉంటుంది. పవన్‌కల్యాణ్‌లోని ఒరిజినాలిటీ నన్ను బాగా ఆకట్టుకుంటుంది. ఆయన నుంచి చాలా నేర్చుకున్నా.
‘విరాటపర్వం’ తర్వాత మీరు అంగీకరించిన సినిమాలేవీ?
‘విరాటపర్వం’ విప్లవం నేపథ్యంలో అందమైన ప్రేమకథతో తెరకెక్కుతోంది. లాక్డౌన్లో ఉన్న కమిట్మెంట్స్ కారణంగా ప్రస్తుతం కొత్త కథలేవీ వినడం లేదు.
‘అరణ్య’సినిమా చూసి మీ భార్య మిహీక ఏమన్నారు?
నేను పెళ్లిచేసుకుంటానని ఎవరూ అనుకోలేదు. ‘అరణ్య’ కోసం రెండున్నరేళ్లు అడవుల్లో ఎక్కువగా గడిపాను. షూటింగ్ పూర్తవగానే పెళ్లిచేసుకున్నా. అడవి నన్ను పూర్తిగా మార్చింది. నా భార్య మిహీక ఈ సినిమా చూసింది. నా నటన బాగుందని చెప్పింది.
Read Today's Latest Movie-gossips News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

