దుమ్మురేపుతున్న ‘జాతి రత్నాలు’ కలెక్షన్లు

ఈ రోజుల్లో ఏ సినిమాకైనా పాజిటివ్ టాక్ వస్తే వీకెండ్ వరకు బాగానే వస్తాయి కలెక్షన్లు. కానీ ఆ తర్వాత సోమవారం వచ్చిందంటే దాని భవిష్యత్తు ఏంటో తేలిపోతుంది. అందుకే ఇండస్ట్రీలో విడుదలైన తర్వాత వచ్చే తొలి సోమవారాన్ని మండే టెస్ట్ అని పిలుస్తారు. ఆ రోజు కానీ సినిమా నిలబడింది అంటే ఇక దానికి తిరుగు లేనట్లే. ఈ వారం విడుదలైన జాతిరత్నాలు సినిమా ఈ టెస్ట్ పాస్ అయింది. నాలుగు రోజుల వీకెండ్ అద్భుతంగా యూజ్ చేసుకున్నారు జాతి రత్నాలు. ఈ సినిమా 4 రోజుల్లోనే రూ.34 కోట్ల గ్రాస్ రూ.21 కోట్ల షేర్ వసూలు చేసింది.
కేవలం మూడు రోజుల్లోనే డిస్ట్రిబ్యూటర్లను లాభాల బాట పట్టించారు జాతి రత్నాలు. నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలలో అనుదీప్ తెరకెక్కించిన ఈ హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ ప్రేక్షకులను బాగా అలరిస్తుంది. దాంతో సోమవారం రోజు కూడా మంచి వసూళ్లు వచ్చాయి. ఐదో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.1.7 కోట్ల షేర్ వసూలు చేసింది జాతి రత్నాలు. దాంతో నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు సంతోషంలో మునిగిపోయారు.
ఈ సినిమాకు పోటీగా విడుదలైన శ్రీకారం, గాలి సంపత్ రెండు నిరాశ పరిచాయి. శర్వానంద్ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కూడా జాతి రత్నాలు దెబ్బకు నిలబడలేకపోయింది. దాంతో జాతి రత్నాలు సోలోగా బాక్సాఫీస్ దగ్గర సంచలన వసూళ్లు సాధిస్తున్నారు. ఏ సినిమా జోరు చూస్తుంటే సెకండ్ వీకెండ్ కూడా హవా కనిపించడం ఖాయం. ఫుల్ రన్లో రూ.30 కోట్ల షేర్ వసూలు చేయడం పక్కా అయిపోయింది. ఇదేగాని జరిగితే రూ.12 కోట్ల లక్ష్యంతో వచ్చిన జాగ్రత్తలు డిస్ట్రిబ్యూటర్లకు రూ.18 కోట్ల లాభాలు తీసుకువచ్చినట్లు అవుతుంది. ఈ సినిమాతో నవీన్ పొలిశెట్టి రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. వీక్ డేస్ మొదలైన తర్వాత కూడా జాతి రత్నాలు వీక్ కావడం లేదు.
Read Today's Latest Movie-gossips News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

