చినుకు ఆగదు..వరద పారదు
‘చినుకు ఆగదు... వరద పారదు’...అన్న చందంగా మారింది సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రాంత పరిస్థితి. వానకాలం ప్రారంభమై దాదాపు రెండు నెలలు గడుస్తున్నా సరైన వర్షాలు లేక కేవ లం ఆరుతడి పంటలకే పరిమితమైన రైతు లు ప్రధాన పంట అయిన వరి, మొక్కజొన్న సాగు చేసేందుకు జంకుతున్నారు.
- చిరు జల్లులతోనే సరిపెడుతున్న వరుణుడు
- కారుమబ్బులు కమ్ముకున్నా భారీ వర్షానికి నోచుకోని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రాంతం
హుస్నాబాద్, జూలై 20: ‘చినుకు ఆగదు… వరద పారదు’…అన్న చందంగా మారింది సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రాంత పరిస్థితి. వానకాలం ప్రారంభమై దాదాపు రెండు నెలలు గడుస్తున్నా సరైన వర్షాలు లేక కేవ లం ఆరుతడి పంటలకే పరిమితమైన రైతు లు ప్రధాన పంట అయిన వరి, మొక్కజొన్న సాగు చేసేందుకు జంకుతున్నారు. వరద పోయే ఒక్క వర్షం కూడా పడకపోవడమే ఇందుకు కారణం. హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి, ధూళిమిట్ట, మ ద్దూరు మండలాల్లోని చెరువులు, కుంటలు వర్షపు నీటికి నోచుకోలేదు.
తుఫాన్ ప్రభావంతో అంతటా భారీ వర్షాలు, వరదలతో కళకళలాడుతుంటే హుస్నాబాద్ డివిజన్లో మాత్రం చిరు జల్లులకే పరిమితమవుతోం ది. గతేడాది జూలై వరకు వరినాట్లు దాదాపు పూర్తయ్యాయి. చెరువులు, కుంటలు కూడా నిండుకుండల్లా మారాయి. ఈ ఏడాది కొద్ది మంది రైతులు మినహా మిగతా రైతులందరూ నార్లు పోసుకొని భారీ వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. గడిచిన వారం రోజులుగా నిత్యం కారు మబ్బులు కమ్ముకోవ డం, చిన్నపాటి చిరుజల్లులు పడటం అనంతరం మబ్బులు కనపడకుండా పోవడం పరిపాటిగా మారింది. ఐదు రోజులుగా రోజూ చినుకులు పడుతున్నాయి తప్పా వర ద పారడం లేదు. కాలం దగ్గరపడుతున్న కొద్దీ రైతన్నల్లో ఆందోళన అధికమవుతోంది. గురువారం రాత్రి 26.18మి. మీటర్ల వర్షపాతం నమోదైంది. జూలైలో మొట్టమొదటిసారి గురువారం రాత్రి మాత్ర మే ఆశాజనకంగా వర్షం కురిసింది. సాయంత్రం మొదలైన వర్షం అర్ధరాత్రి దాటే వరకు పడటంతో కొన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి తప్పా వరదలుమాత్రం పారలేదు.
బెజ్జంకి మండలంలో 24.3మి.మీటర్ల వర్షం పడగా, కోహెడ మండలంలో 36.4 మి.మీటర్లు, హుస్నాబాద్ మండలంలో 23.4మి.మీటర్లు, అక్కన్నపేట మండలం లో 23.6 మి.మీటర్లు, మద్దూరు మండలం లో 20.0 మి.మీటర్లు, ధూళిమిట్ట మండలంలో 29.4 మి.మీటర్ల వర్షం పడింది. మొత్తం మీద ఒకే రోజు రాత్రి ఆరు మండలాల్లో కలిపి 26.18 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు వరకు వానముసురు ముసురుకుంది తప్పా భారీ వర్షం పడలేదు. వరుణు డు కరుణించి భారీ వర్షం పడాలని, మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ పంటలతో కళకళలాడాలని ఆశిద్దాం…
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
BRS | మాజీ ఎమ్మెల్యే గండ్ర సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన యువత
నల్లగొండ వన్ టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి బదిలీ
North Korean Hackers: ఆ చోరీ వెనుక ఉన్నది నార్త్ కొరియా హ్యాకర్లే
Srinivas Goud | కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దయనీయం : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

