అమీన్పూర్లో వేర్వేరు సంఘటనల్లో ముగ్గురు అదృశ్యం
బయటకు వెళ్లి తిరిగి వస్తానని చెప్పిన వ్యక్తి అదృశ్యమైన సంఘటన అమీన్పూర్ పోలీసుస్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది.ఎస్ఐ సుభాష్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.బీరంగూడ వీరారెడ్డి కాలనీ గ్రీన్‌ఫీల్డ్‌కు చెందిన వెంకట్ ఈ నెల 20న ఇంటినుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేడు
అమీన్పూర్, డిసెంబర్ 23 : బయటకు వెళ్లి తిరిగి వస్తానని చెప్పిన వ్యక్తి అదృశ్యమైన సంఘటన అమీన్పూర్ పోలీసుస్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది.ఎస్ఐ సుభాష్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.బీరంగూడ వీరారెడ్డి కాలనీ గ్రీన్‌ఫీల్డ్‌కు చెందిన వెంకట్ ఈ నెల 20న ఇంటినుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేడు.దీంతో కుటుంబసభ్యులు చుట్టు పక్కల వారి వద్ద బంధువులు వద్ద ఆరా తీశారు. ఫలితం లేకపోయేసరికి తండ్రి పవన్‌కుమార్ అమీన్పూర్ పోలీసులకు పిర్యాదు చేశాడు.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మరో వ్యక్తి అదృశ్యం
నిత్యం తాగుతూ ఇంటికి వచ్చిన భర్తను మందలించడంతో ఇంటినుంచి వెళ్లి తిరిగి రాకుండా అదృశ్యమైన సంఘటన అమీన్పూర్ పీఎస్ పరిధిలో శుక్రవారం చోటుకుంది. ఎస్సై సభాశ్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని ఎన్ఎస్ఎల్ కాలనీ చెందిన అశోక్ (60) రోజూ మద్యం సేవించి వస్తున్న భర్తను భార్య శారద మందలించింది. దీంతో ఈ నెల 12న ఇంటినుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యుల పిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నట్లు తెలిపారు.
బాలుడు అదృశ్యం
బాలుడు అదృశ్యమైన సంఘటన అమీన్పూర్ పీఎస్ పరి ధిలో చోటు చేసుకుంది.తల్లి పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమెదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నట్లు తెలిపారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

