నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి

చేగుంట: నిరుపేదల అభివృద్ధే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు.నార్సింగి మండల కేంద్రంలోని రైతువేదికలో బుధవారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద ఆడబిడ్డలకు అండగా కల్యాణలక్ష్మి పథకం ద్వారా రూ.లక్షా 116లను ప్రభుత్వం అందిస్తుందని వెల్లడించారు. రైతుల అభివృద్ధి కోసం రైతు బంధు, రైతుబీమా వంటి పథకాలను అమలు చేసిన ముఖ్యమంత్రికి రుణపడి ఉంటామన్నారు.
మిషన్‌భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి తాగు నీరును ప్రభుత్వం అందిస్తుందన్నారు. కేసీఆర్ తలపెట్టిన పల్లె ప్రగతిలో మంచి ఫలితాలు వస్తుండడంతో పాటు గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రంగా మారుతున్నాయన్నారు.ఈ కార్యక్రమంలో నార్సింగి ఎంపీపీ చిందం సబీత, జడ్పీటీసీ బాణపురం కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ దొబ్బల సుజాత, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎన్నం రాజేందర్‌రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ఎరం అశోక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తౌర్యనాయక్, నార్సింగి సొసైటీ చైర్మన్ శంకర్‌గౌడ్, తాసీల్దార్ సత్యనారాయణ, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సత్యనారాయణ, ఈవో యాదగిరి, ఎంపీటీసీలు ,సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పండుటాకులకు పింఛన్ కరువు’
Satyajit Ray Film Institute: నసీరుద్దీన్ షా వ్యాఖ్యలను తప్పుపట్టిన సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
DMK Ex-Minister Arrested | ప్రైవేట్ స్కూల్స్ నుంచి వంద కోట్లు లంచం ఆరోపణలు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

