Husnabad |రాష్ట్రాభివృద్ధి సీఎం కేసీఆర్‌తోనే సాధ్యం : హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్

కోహెడ: రాష్ట్ర అభివృద్ధి సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ అన్నారు. మంగళవారం ఆయన మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. అభివృద్ధి పనులకు భూమిపూజలు, ప్రారంభోత్సవాలు చేశారు. వర్షాలు , వరదలతో దెబ్బతిన్న రోడ్లు , కాజ్‌వేలు, బ్రిడ్జిలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణను పోరాడి సాధించిన సీఎం కేసీఆర్ రాష్ట్రాభివృద్ధికి కృషిచేస్తున్నారన్నారు. దేశంలోని ఏ రాష్ట్రం అమలు చేయని పథకాలను సీఎం కేసీఆర్ ఇక్కడ ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని కొనియాడారు.
మండలంలోని కాచాపూర్ గ్రామంలో పీహెచ్సీ సబ్సెంటర్కు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. అనంతరం మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభించారు. వర్షాలకు దెబ్బతిన్న వరికోలు వంతెనను, నారాయణపూర్ కల్వర్టును పరిశీలించారు. వింజపల్లిలో నూతనంగా నిర్మిస్తున్నపంచాయతీ భవనం, పీహెచ్సీ సబ్సెంటర్కు భూమిపూజ చేశారు. కోహెడలో వైకుంఠధామాన్ని ప్రారంభించారు. అనంతరం కూరెల్లలో హెల్త్ సబ్సెంటర్కు, మహిళా సమాఖ్య భవనానికి భూమిపూజ చేశారు. తంగళ్లపల్లిలో వర్షాలకు దెబ్బతిన్న పిల్లి వాగును, బస్వాపూర్‌లో దెబ్బతిన్న బ్రిడ్జిని పరిశీలించారు. అనంతరం సముద్రాల గ్రామ సర్పంచ్ పిల్లి మాధవి అత్తమ్మ చనిపోగా ఆ కుటుంబాన్ని పరామర్శించారు.
ఎమ్మెల్యేకు వినతుల వెల్లువ
మండలంలో వర్షాలకు దెబ్బతిన్న వరికోలు వంతెనను ఎమ్మెల్యే పరిశీంచగా గ్రామ సర్పంచ్ చంద్రకళ మరమ్మతులు చేయించాలని విజ్ఞప్తి చేసింది. వింజపల్లిలో పాఠశాల వద్దగల మత్తడిపై వంతెన నిర్మించాలని సర్పంచ్ తిరుపతిరెడ్డి వినతి పత్రం అందజేశారు. కూరెల్లలో ఒడ్డెరకాలనీ తండాల మధ్య ఉన్న కల్వర్టు కొట్టుకుపోయినందున వెంటనే నిర్మించాలని సర్పంచ్ రమేశ్ ఎమ్మెల్యేకు వినతి పత్రం సమర్పించారు. అలాగే తంగళ్లపల్లి-శనిగరం గ్రామాల మధ్య ఉన్న పిల్లివాగుపై హైలెవెల్ బ్రిడ్జి నిర్మించాలని సర్పంచ్‌లు, పాము నాగేశ్వరి, కర జయశ్రీలు విజ్ఞప్తి చేశారు. బస్వాపూర్ బ్రిడ్జిపై వెంటనే మరమ్మతులు చేయించాలని ఎంపీపీ కొక్కుల కీర్తి ఎమ్మెల్యేను కోరారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ప్రజలు ఇచ్చిన విజ్ఞప్తుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ కొక్కుల కీర్తి, జడ్పీటీసీ నాగరాజు శ్యామల, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కర శ్రీహరి, ప్యాక్స్ చైర్మన్ పేర్యాల దేవేందర్‌రావు, ఏఎంసీ చైర్మన్ ఆవుల రాదమ్మ, మండల పార్టీ అధ్యక్షుడు ఆవుల మహేందర్, పేర్యాల రాజేశ్వర్‌రావు, నాయకులు కొక్కుల సురేశ్, అబ్దుల్ ఖదీర్, గాజుల రమేశ్, ఇప్పరపల్లి కృష్ణమూర్తి, బత్తిని తిరుపతి, వట్టిపల్లి శ్రీనివాస్‌రెడ్డి, జాలిగాం శంకర్ పాల్గొన్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

