Mission Bhagiratha | మిషన్ భగీరథ పైపు పగిలి వృథా నీళ్లు.. పట్టించుకోని అధికారులు
వెంకట్రావుపేట నుండి చందాపూర్ రాంపూర్ వెళ్లే మార్గంలో మిషన్ భగీరథ పైపులైన్ పదేపదే పగులుతుండటంతో వేల లీటర్ల తాగునీరు వృథాగా పోతోంది.
తొగుట: సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో వెంకట్రావుపేట నుండి చందాపూర్ రాంపూర్ వెళ్లే మార్గంలో మిషన్ భగీరథ పైపులైన్ పదేపదే పగులుతుండటంతో వేల లీటర్ల తాగునీరు వృథాగా పోతోంది.
15 రోజుల్లోనే మూడు నాలుగు సార్లు పైపు పగిలిందని, పొలాల్లోకి నీరు ఉధృతంగా వస్తూ వరి పంటలోకి చేరుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పగిలిన చోట నుంచి ఫౌంటెన్ లా నీరు ఎగజిమ్ముతూ కాలువల్లోకి ప్రవహిస్తోంది.
ఎంత చెప్పినా మిషన్ భగీరథ అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేసి వెళ్తున్నారని, శాశ్వత పరిష్కారం చూపడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఒక పక్క తాగునీటికి ఇబ్బందులు ఉంటే, మరో పక్క ఇలా నీరు వృధా అవ్వడం బాధాకరమన్నారు. దీనివల్ల పంట పొలాలు దెబ్బతినడంతో పాటు, ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లుతోంది. కాబట్టి అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, నాణ్యమైన పైపులతో శాశ్వత మరమ్మతులు చేపట్టాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Alias Rukmini | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్!
Rapido Driver | కానిస్టేబుల్ చెవిని కొరికిన ర్యాపిడో డ్రైవర్.. వీడియో
Cyclonic storm | ఏపీ, ఒడిశాకు పొంచివున్న తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వాలు..!
Ramayana | రాముడు, సీత ప్రేమకు సంగీత రూపం.. ‘రామాయణ’ నుంచి ‘రంగులు రంగులే’ పాట విడుదల!
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ వివాదంపై స్పందించిన దర్శకుడు వేణు ఉడుగుల.. ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

