మునిపల్లిలో పెన్షన్స్ పంపిణీ.. అసంతృప్తి వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు
కొత్త పింఛన్ల మంజూరు పత్రాలు పంపిణీ చేస్తే ఇంత హడావిడి అవసరమా అంటూ సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల వాసులు ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మునిపల్లి, నవంబర్ 17 : కొత్త పింఛన్ల మంజూరు పత్రాలు పంపిణీ చేస్తే ఇంత హడావిడి అవసరమా అంటూ సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల వాసులు ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంకు 4వేల పెన్షన్ ఇస్తామన్న మాట గుర్తు ఉందా లేదా అని పింఛన్ లబ్దారులు సర్కార్ తీరుపై దుమ్ము ఎత్తిపోస్తున్నారు. మంగళవారం మండల కేంద్రమైన మునిపల్లిలో నూతన పింఛన్లు మంజులైన పత్రాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హాజరై నూతన పెన్షన్ పత్రాలు అందించారు.
నూతన పెన్షన్ పత్రాలను తీసుకునేందుకు కార్యక్రమానికి హాజరైన లబ్ధిదారులు ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. పింఛన్ల మంజూరు చేయడం మంచిదే..ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసి సమావేశాలు సభలు ఏర్పాటు చేయడం అవసరమా అంటూ ప్రజల ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో అడ్డగోలు హామీలు ఇచ్చి నేడు ఇచ్చిన హామీలు పక్కనపెట్టి ప్రజలు నమ్మించేందుకు చేస్తున్న పలు మోసాలను ప్రజలు గమనిస్తున్నట్లు పింఛన్ దారులు సర్కార్ తీరు పై పలు రకాల విమర్శలు చేస్తున్నారు.
ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 4వేల పెన్షన్ తీసుకోండి అంటూ నాడు గొప్పలు చెప్పిన రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నేడు మరిచిపోయావా అంటూ రేవంత్ రెడ్డి పై సొంత పార్టీలో పెన్షన్లు తీసుకుంటున్న వారే పక్కపంటిపోయి తీరొక్క తిట్టు తిడుతున్నారు. 4వేల పెన్షన్ వస్తుందని ఓటు వేస్తే తగిన బుద్ధి చెప్పిండ్రు.. మనకు మోసం చేసిన వారికి మనం మోసం చేస్తే ఎట్లా ఉంటుందో చూపించాలంటూ పెన్షన్ లబ్ధిదారులు గుసగుసలు మాట్లాడుకుంటున్నారు.
మండలంలో 629నూతన పింఛన్లు మంజూరు
మునిపల్లి మండలంలో నూతనంగా (629)మందికి వివిధ రకాల పింఛన్లు మంజూరైనట్లు ఎంపీడీఓ అంజయ్య తెలిపారు. మునిపల్లి మండలంలో మొత్తం పింఛన్లు (5,338)పెన్షన్ దారులు పింఛన్ తీసుకుంటున్నాట్లు తెలిపారు. మండలంలోని గ్రామాల్లో వితంతు (2734), ఓల్డ్ ఏజ్ (1733), వికలాంగుల(495), ఒంటరి మహిళ (298), కల్లుగీత కార్మికులు(74), చేనేత కార్మికులు (4)గురు పింఛన్లు తీసుకుంటున్నట్లు ఎంపీడీవో తెలిపారు. మునిపల్లి మండలంలోని గ్రామాల్లో పింఛన్లు రానివారు ఎవరైనా అర్హులై ఉంటే మునిపల్లి మండల పరిషత్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే సంబంధిత పంచాయతీ కార్యదర్శి తో ఎంక్వైరీలో అర్హులుగా గుర్తిస్తే పింఛన్లు అందిస్తారన్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | వన్ మోర్ ఛాన్స్.. కాల్పుల ఘటన తర్వాత రీఎంట్రీ ఇచ్చిన టైగర్ ష్రాఫ్!
Bellampally Police | రికార్డుల్లోనేమో ఆన్‌డ్యూటీ.. కానీ ఫాంహౌస్‌లో పోలీసుల చిందులు.. వీడియో
కోడి దొంగతనం కేసు.. మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
AP News | ఏపీలో లోకల్‌బాడీ ఎన్నికలు.. ఈ నెల 26న 23 మున్సిపాలిటీల్లో సెలవు..!
లావుడియా తండా గ్రామ పెద్దగా వాగ్య నాయక్ ఎన్నిక
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

