రోడ్డు భద్రత అందరి బాధ్యత
మానవ తప్పిదాలతో 91 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయని అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ సందీప్ శాండిల్య అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో మెదక్, సంగారెడ్డి జిల్లాల ఎస్పీలు, రెండు
అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ సందీప్ శాండిల్య
రోడ్డు భద్రతా ప్రమాణాలు, ప్రమాదాల నివారణపై సమీక్ష
మెదక్, మే6: మానవ తప్పిదాలతో 91 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయని అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ సందీప్ శాండిల్య అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో మెదక్, సంగారెడ్డి జిల్లాల ఎస్పీలు, రెండు జిల్లాల పరిధిలోని 14 పోలీస్స్టేషన్ల అధికారులతో రోడ్డు భద్రతా ప్రమాణాలు, ప్రమాదాల నివారణ చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ జిల్లాలో జాతీయ రహదారి 44, 765 డితో పాటు రాష్ట్ర, జిల్లా రహదారులు 246 కిలోమీటర్ల పొడువు ఉన్నాయన్నారు.
తూప్రాన్, చేగుంట, మనోహరాబాద్, రామాయంపేట, కౌడిపల్లి, కొల్చారం, పుల్కల్, నర్సాపూర్, సంగారెడ్డి జిల్లాలో పటాన్చెరువు, సదాశివపేట, సంగారెడ్డి రూరల్, గుమ్మడిదల, జోగిపేట, హత్నూర వంటి ప్రాంతాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. రోడ్డు భద్రతా మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగిన పోలీస్స్టేషన్లను గుర్తించి కారణాలు, తక్షణ నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కువ ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, చెట్ల పొదల తొలగింపు, రేడియం బ్లింకర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలకు అవగాహన కల్పించడంతో ప్రమాదాలను నివారించవచ్చన్నారు. చిరు వ్యాపారులు తమ వ్యాపారాలు రోడ్డుకు దూరంగా చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, సంగారెడ్డి ఎస్పీ ఎం.రమణకుమార్, మెదక్, సంగారెడ్డి జిల్లాల డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
- Tags
- collective
- medak
- Police
- Road Safety
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

