Medak | తండ్రి బాటలో తనయుల విజయం.. ఉన్నత చదువులు చదివి కులవృత్తికి జీవం పోస్తున్న యువకులు
తండ్రి బాటలో నడిచారు.. కులవృత్తికి జీవం పోసేందుకు ఉక్కు సంకల్పంతో ముందుకు సాగారు.. అధునాతన పోకడలకు అనుగుణంగా ఆలోచించి నైపుణ్యానికి పదును పెట్టారు.. తాము నమ్ముకున్న కళామ తల్లిని నిత్యం ‘రథం’పై ఊరేగిస్తూ కులవృత్తికి జీవం పోస్తున్నారు..
Medak | తండ్రి బాటలో నడిచారు.. కులవృత్తికి జీవం పోసేందుకు ఉక్కు సంకల్పంతో ముందుకు సాగారు.. అధునాతన పోకడలకు అనుగుణంగా ఆలోచించి నైపుణ్యానికి పదును పెట్టారు.. తాము నమ్ముకున్న కళామ తల్లిని నిత్యం ‘రథం’పై ఊరేగిస్తూ కులవృత్తికి జీవం పోస్తున్నారు.. రథాల తయారీలో రారాజులుగా పేరు పొందారు ఈ ముగ్గురు మొనగాళ్లు! ఫలితంగా రథం మే‘కింగ్స్’కు మెదక్ పట్టణం కేరాఫ్‌గా మారింది.
మెదక్ రూరల్, మే 24: గతంలో కలపతో చేసిన రథాలు ఉండేవి. ఇప్పుడు వాటి స్థానంలో ఇనుప రథాలు వచ్చేశాయి. అందుకే ఇనుమును తీసుకువచ్చి వాటిని విడి భాగాలు చేస్తారు. ఆ తర్వాత వెల్డింగ్ చేసి రథంగా తయారు చేస్తారు. వాటికి రంగులు వేసి అందంగా తీర్చదిద్దితారు. ఎక్కువ కాలం మన్నికగా ఉండాలనే ఉద్దేశంతో ఇనుప రథాలను తయారు చేస్తున్నారు.
తండ్రి బాటలో ముగ్గురు మొనగాళ్లు…
మెదక్ జిల్లాకేంద్రానికి చెందిన కమ్మరి రాములు కర్రలతో రథాలు తయారు చేసి ఉపాధి పొందేవారు. ఆయన ముగ్గురు కొడుకులు కమ్మరి వెంకట్, రాజు, కృష్ణ ఉన్నత చదువులు చదివి తమ తండ్రి బాటలో నడుస్తున్నారు. రథాల తయరీని ఉపాధిగా మలుచుకున్నారు. స్థానిక చిల్డ్రన్స్ పార్కు వద్ద తమ షాపును ఏర్పాటు చేస్తుకున్నారు. అవసరమైన ముడి సరుకులు హైదరాబాద్ నుంచి తీసుకువచ్చి రథాలు తయారు చేస్తున్నారు. దాదాపు రెండు దశాబ్దాలుగా విభిన్న ఆకృతుల్లో రథాలను రూపొందిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లావాసులే కాక ఇతర జిల్లాల వారు సైతం వీళ్లతో రథాలు తయారు చేయిస్తున్నారు.
కళాత్మకత, నైపుణ్యతతో ఉపాధి…
విభిన్న డిజైన్లలో గోపురాలు తయారు చేయడం, పెద్ద పెద్ద గంటలు కట్టి, ఆక్షర్షణీయంగా రథాన్ని ముస్తాబు చేయడంలో ఆరితేరారు ఈ ముగ్గురు మొనగాళ్లు! గ్రామాల్లోని ఆలయ కమిటీ పెద్దలు ఎంచుకున్న డిజైన్, సైజును బట్టి రథాలు తయారు చేస్తారు. ఒక రథం తయారు చేయాలంటే రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుందని చెబుతున్నారు. రథం సైజ్‌ను బట్టి సుమారు రూ.5 నుంచి రూ.7 లక్షల వరకు ఖర్చవుతుందంటున్నారు. ఇప్పటి వరకు 20కి పైగా రథాలను తయారుచేశామని తెలిపారు. సీజన్‌ను బట్టి నూతన ఇంటి నిర్మాణానికి సంబంధించిన పరికరాలు తయారు చేస్తామని చెప్పారు. ఈ ముగ్గురు అన్నదమ్ములు తాము ఉపాధి పొందుతూ మరికొంత మందికి ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
రథాల తయారీతో ఉపాధి..
మేము ముగ్గురు అన్నదమ్ములం. స్థానిక చిల్డ్రన్స్ పార్కు వద్ద షాపును ఏర్పాటు చేస్తుకున్నాం. నాన్న కులవృత్తినే నమ్ముకొని జీవనం సాగించారు. కర్రలతో రథాలు తయారుచేయడంలో ప్రత్యేకత చాటుకున్నారు. ఆయన మార్గంలోనే నడుస్తూ కులవృత్తిని కాపాడుతున్నాం. కాలానికి అనుగుణంగా కొత్తగా ఆలోచిస్తూ మేము ఉపాధి పొందుతూ మరికొంత మందికి పని కల్పిస్తున్నాం.
– రాజు, రథాల తయారీ దారుడు, మెదక్
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

