చట్టం ఎదుట అందరూ సమానం
చట్టం ఎదుట అందరూ సమానులేనని పేదలకు ఉచిత న్యాయ సహాయం, సేవలు అందించడమే న్యాయ సేవాధికార సంస్థ ధ్యేయమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ అన్నారు.
- మెదక్ కోర్టు ఆవరణలో ఉచిత న్యాయ సేవ సంస్థలు ఏర్పాటు
- వర్చువల్‌లో ప్రారంభించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్
మెదక్ అర్బన్, జనవరి 2: చట్టం ఎదుట అందరూ సమానులేనని పేదలకు ఉచిత న్యాయ సహాయం, సేవలు అందించడమే న్యాయ సేవాధికార సంస్థ ధ్యేయమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ అన్నారు. ఉచిత న్యాయ సహాయం పొందడం కోసం రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన 23 జిల్లాల్లో జిల్లా న్యాయ సేవా సంస్థలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సోమవారం వర్చువల్ విధానంలో జిల్లా న్యాయస్థానం సముదాయంలో జిల్లా న్యాయ సేవాసంస్థల సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ పౌరుడు ఆర్థిక కారణాల వల్ల, ఇతర కారణాలతో న్యాయాన్ని పొందే అవకాశాలను కోల్పోకుండా, ఉచిత న్యాయ సహాయం పొందడానికి జిల్లా న్యాయ సేవా సంస్థలను ఏర్పాటు చేశామన్నారు. పేదలకు మెరుగైన న్యాయ సేవలందించేందుకు జాతీయ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా 25 సంవత్సరాల నుంచి రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో ఉచిత న్యాయ సేవలు అందిస్తున్నామన్నారు. జిల్లాలో ఏర్పాటు చేస్తున్న న్యాయ సేవా సంస్థల సేవలను పేదలు ఉపయోగించుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి లక్ష్మీశారద మాట్లాడుతూ న్యాయసేవ సంస్థ ద్వారా సామాన్య ప్రజలకు న్యాయ సేవలందించడం, లోక్ అదాలత్‌లను నిర్వహించి 3 లక్షల్లోపు ఆదాయం ఉన్న వారికి ఉచిత న్యాయ సేవలందించేందుకు న్యాయవాదిని ఏర్పాటుచేసి న్యాయ సేవలందిస్తామన్నారు.
స్వతహాగా న్యాయవాదిని ఏర్పాటు చేసుకోలేని పేదవారికి న్యాయవాదులను ఏర్పాటు చేయడం, వారికి న్యాయపరమైన హక్కులు, సేవలు కల్పిస్తామన్నారు. ప్రజలకు చట్టాలపై అవగాహన కలిగించేందుకు న్యాయ సేవ సంస్థ ద్వారా క్షేత్రస్థాయిలో సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా న్యాయసేవాసంస్థ అందించే ఉచిత న్యాయ సేవలు ప్రజలు వినియోగించుకోవాలన్నారు. అనంతరం కోర్టు సముదాయంలో ఏర్పాటు చేసిన జిల్లా న్యాయ సేవ సంస్థ భవనంలో ఎస్పీ రోహిణి ప్రియదర్శినితో కలిసి పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రత్యేక రక్తదాన శిబిరాన్ని ప్రారంభించగా, జిల్లా సీనియర్ సివిల్ న్యాయమూర్తి జితేందర్, పలువురు న్యాయవాదులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో సెక్రటరీ-కం-సీనియర్ సివిల్ న్యాయమూర్తి జితేందర్, ప్రథమ శ్రేణి జుడీషియల్ మేజిస్ట్రేట్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రీటాలాల్చంద్, జూనియర్ సివిల్ జడ్జి కల్పన, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పైజల్ అహ్మద్, ఏజీపీ సిరిగ శ్రీనివాస్, మెదక్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.బాలయ్య, సెక్రటరి శ్రీనివాస్, కోశాధికారి దుర్గారెడ్డి, న్యాయవాదులు సి.పోచయ్య, మమా వెంకటేశం, రామ్శర్మ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

