మట్టి గణేశ్ విగ్రహాలను వినియోగించాలి :కలెక్టర్ ప్రతిమా సింగ్
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మెదక్ జిల్లా ప్రజలందరికి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ శుభాకాంక్షలు తెలిపారు.
మెదక్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ ) : వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మెదక్ జిల్లా ప్రజలందరికి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుని కృపతో ప్రజల జీవితాల్లోని విఘ్నాలన్ని తొలగిపోయి, ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. bజిల్లా ప్రజలందరూ గణేష్ చతుర్థి పండుగను భక్తిశ్రద్ధలతో, సంతోషంగా, ఐకమత్యంతో జరుపుకోవాలని కలెక్టర్ కోరారు. గణపతి ఆశీస్సులతో జిల్లాలో శాంతి, సౌభాగ్యం నెలకొనడంతో పాటు ప్రజల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలని ఆకాంక్షించారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలు మట్టి గణేశ్ విగ్రహాలను వినియోగించాలని సూచించారు.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను ఉపయోగించకుండా, నీటి కాలుష్యాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. గణేశ్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా స్వచ్ఛత, క్రమశిక్షణ పాటిస్తూ ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని తెలిపారు. నిమజ్జనం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాంతాల్లోనే విగ్రహాలను నిమజ్జనం చేయాలని సూచించారు. ప్రజలందరూ పరస్పర సహకారంతో, ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి వేడుకలను నిర్వహించుకోవాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ కోరారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మద్యం తాగేందుకు వెళ్లి.. విద్యుదాఘాతంతో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబం’ జోరు.. 24 గంటల్లోనే 2.14 లక్షలకు పైగా టికెట్లు అమ్మకం!
One Lakh Crore | నెలకు రూ.10వేల జీతం.. కానీ బ్యాంక్ అకౌంట్లో లక్ష కోట్లు.. చివరకు షాక్!
Rajeev Kanakala | ‘డ్రాగన్’తో ఎన్టీఆర్ అభిమానులు రెండు కాలర్లు ఎగరేయడం ఖాయం.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
Traffic Challan | ఫుట్‌పాత్‌పై బైక్ నడిపితే రూ.5 వేలు.. వన్‌వేలో వెళ్తే రూ.10 వేల ఫైన్? బెంగళూరులో కఠినంగా ట్రాఫిక్ రూల్స్!!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

