సీజ్ చేసిన షెడ్లలో దర్జాగా దందా
అధికారుల ఆదేశాలను కొందరు వ్యాపారులు బేఖాతర్ చేస్తున్నారు. షెడ్ల నిర్మాణాలకు అనుమతులు లేవంటూ ఐలా అధికారులు ఆయా షెడ్లకు సీజింగ్ నోటీసులు అతికించి తాళాలు వేయించినా వ్యాపారులు మాత్రం అధికారుల కండ్లుకప్పి దర్జాగా వ్యాపారం చేస్తున్నారు.
- టీఎస్ ఐలా అధికారుల ఆదేశాలు బేఖాతర్
- ఇండస్ట్రియల్ ల్యాండ్‌లో కమర్షియల్ షెడ్ల నిర్మాణం
- ప్రతి షెడ్‌కు నోటీసు అతికించి మూసివేసిన అధికారులు
- షెటర్లను తెరిచి వ్యాపారం కొనసాగిస్తున్న వైనం
రామచంద్రాపురం, ఏప్రిల్ 1 : అధికారుల ఆదేశాలను కొందరు వ్యాపారులు బేఖాతర్ చేస్తున్నారు. షెడ్ల నిర్మాణాలకు అనుమతులు లేవంటూ ఐలా అధికారులు ఆయా షెడ్లకు సీజింగ్ నోటీసులు అతికించి తాళాలు వేయించినా వ్యాపారులు మాత్రం అధికారుల కండ్లుకప్పి దర్జాగా వ్యాపారం చేస్తున్నారు. ఆర్సీపురం డివిజన్లోని జాతీయరహదారికి ఆనుకొని ఉన్న ఇండస్ట్రియల్ ల్యాండ్‌లో పెద్ద ఎత్తున ఐదు కమర్షియల్ షెడ్లను ఓ వ్యాపారి నిర్మించారు. ఇండస్ట్రియల్ ల్యాండ్‌లో కమర్షియల్ షెడ్లు వేయడంతో పలువురు టీఎస్ ఐలా అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన ఐలా జోనల్ మేనేజర్ అనురాధ ఇటీవల షెడ్ల నిర్వహణపై విచారణ చేసి అనుమతులు లేకుండా కమర్షియల్ షెడ్లలను నిర్మించినట్లు గుర్తించి ఆయా మార్బల్, టైల్స్ దుకాణాలకు సీజింగ్ నోటీసులు అతికించి తాళాలు వేయించారు. అదేవిధంగా వాటి పక్కనే మరో షెడ్లో టోయోట షోరూం పనులను నిలిపివేసి నోటీసులు జారీ చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ షెడ్లను ఏర్పాటు చేయించిన వ్యాపారి, ఆషెడ్లను లీజుకు తీసుకున్న కొందరు వ్యాపారులు అధికారుల కండ్లు కప్పి షెటర్లను దొంగతనంగా తెరుస్తూ వ్యాపారం నిర్వహిస్తున్నారు. అధికారులు ఒకసారి సీజ్ చేసిన తర్వాత వాటిని తెరిచే హక్కు మనకు ఉండదు.
ఒకవేళ అధికారుల ఆదేశాలు బేఖాతర్ చేస్తే చట్టరీత్యా నేరం. షెడ్ల నిర్వహణకు సంబంధిత అధికారుల నుంచి అనుమతుల రూపంలో గ్రీన్ సిగ్నల్ వచ్చినప్పుడు మాత్రమే షెటర్లను తెరవాలి. కానీ ఇక్కడ అలాంటి నిబంధనలు వ్యాపారులు పాటించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అధికారుల ఆదేశాలను పాటించకుండా షెటర్లను తెరువడంపై పలువురు విస్మయం చెందుతున్నారు. మధ్యాహ్నం, రాత్రి సమయంలో ఎవరూ చూడకుండా షెటర్లకు అడ్డంగా కార్లు, ట్రాన్స్పోర్ట్ ఆటోలు పెట్టి షెటర్లను కొంతమేర తెరిచి మార్బల్స్, టైల్స్ ట్రాలీ ఆటోలో లోడ్ చేసి లోడింగ్ పూర్తికాగానే ఆటోలను బయటకు పంపిస్తున్నారు. పెద్ద షెటర్లకు చిన్న డోర్ మాదిరిగా ఎంట్రీని కూడా ఏర్పాటు చేసి వాటిని ఓపెన్‌గా ఉం చుతూ కార్యకలాపాలను జరుపుతున్నారు. ట్రాలీ ఆటోల్లో లోడింగ్ పూర్తయిన తర్వాత షెటర్లను క్లోజ్ చేస్తున్నారు. టోయోట షో రూంలో రాత్రి వేళ నిర్మాణ పనులను కొనసాగిస్తున్నారు. అధికారులు సీజ్ చేసిన రెండో రోజు నుంచే ఈ తంతు జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు.
షెడ్లను ఖాళీ చేయిస్తాం
ఆర్సీపురంలోని ఇండస్ట్రియల్ ల్యాండ్ లో ఏర్పాటు చేసిన కమర్షియల్ షెడ్లకు ఎలాంటి అనుమతులు లేకపోవడంతో ఇటీవల సీజ్ చేశారు. అయినా సదరు వ్యాపారి షెటర్లను తెరిచి వ్యాపారం నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చింది. అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. త్వరలోనే షెడ్లను ఖాళీ చేయించి వాటిని తొలిగిస్తాం. ఇండస్ట్రియల్ ల్యాం డ్లో కమర్షియల్ వ్యాపారం చేయడానికి వీలు లేదు.
– అనురాధ, ఐలా జోనల్ మేనేజర్
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

