ప్రతిగింజా కొనుగోలు చేస్తాం
రైతులు ఆధైర్యపడవద్దని, చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు హామీ ఇచ్చారు. సోమవారం మండల పరిధిలోని కూకుట్లపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి, రైతులతో మాట్లాడారు.
- అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు
కౌడిపల్లి, మే 27 : రైతులు ఆధైర్యపడవద్దని, చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు హామీ ఇచ్చారు. సోమవారం మండల పరిధిలోని కూకుట్లపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి, రైతులతో మాట్లాడారు. దళారులను నమ్మొద్దని, కొనుగోలు కేంద్రం లో అన్ని సౌకర్యం కల్పించామని ఆయన తెలిపారు. అనంతరం డీఆర్డీఏ శ్రీనివాసులు ధా న్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి బుజిరంపేట గ్రామంలో పాఠశాలల విద్యార్థుల కోసం మహిళా సంఘాలు స్కూల్ డ్రెస్సుల కుట్టు శిక్షణను తనిఖీ చేశారు.
అల్లాదుర్గంలో..
అల్లాదుర్గం, మే 27 : రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయాధికారి గోవింద్ హెచ్చరించారు. శంకరంపేట డివిజన్ పరిధిలోని అల్లాదుర్గం, శంకరంపేట,రేగోడ్,టేక్మాల్ మండలాల విత్తన డీలర్లకు మండల పరిధిలోని ముస్లాపూర్ రైతు వేదికలో నకిలీ విత్తనాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
నకిలీ విత్తనాలపై అవగాహన అవసరం
శివ్వంపేట, మే 27 : రైతులు నకిలీ విత్తనాలపై అవగాహన కలిగి ఉండాలని మండల వ్యవసాయాధికారి లావణ్య అన్నారు. మండలంలోని రూప్లతండా, కొత్తపేట, సికింద్లాపూర్, బిజిలీపూర్, దొంతి గ్రామాల్లో విత్తనాల కొనుగోలులో పాటించాల్సిన జాగ్రతలపై రైతులకు అవగాహన కల్పించారు.
గడువు ముగిసినవి కొనుగోలు చేయొద్దు
చేగుంట,మే 27 : గడువు ముగిసిన విత్తనాలను కొనుగోలు చేయొద్దని, విత్తన కొనుగోలుపై రైతులు తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని చేగుంట మండల వ్యవసాయశాఖా అధికారి హరిప్రసాద్ అన్నారు. చేగుంట మండల పరిధిలోని ఉల్లితిమ్మాయిపల్లి, ఇబ్రహీంపూర్,బోనాల,కసాన్పల్లి తదితర గ్రామా ల్లో రైతు సభలు నిర్వహించారు.
విత్తన కొనుగోళ్లపై అవగాహన సదస్సు
కొల్చారం, మే 27 : వ్యవసాయ అధికారి స్వేతాకుమారి ఆధ్వర్యంలో మండల పరిధిలోని వరిగుంతం, సంగాయిపేట, అంసానిపల్లి గ్రామాల రైతులకు విత్తన కొనుగోళ్లపై అవగాహన సదస్సు నిర్వహించారు.
కౌడిపల్లిలో..
కౌడిపల్లి, మే 27 : మేలు రకం విత్తనాలను కొనుగోలు చేసి, విధిగా రసీదులను పొం దాలని మండల వ్యవసాయాధికారి స్వప్న జాదవ్ అన్నారు. మండల పరిధిలోని వెంకట్రావ్పేట, సదాశివపల్లి, బూరుగడ్డ, బుజిరంపేట, మంతాయిపల్లి తండాలో రైతులకు అవగహన కల్పించినట్లు తెలిపారు.
సేంద్రియ పద్ధతిలో
చిన్నశంకరంపేట, మే 27 : పంట మార్పిడితోనే రైతులు అధిక లాభాలు ఆర్జించవచ్చని మండల వ్యవసాయాధికారి లక్ష్మీప్రవీణ్ సూచించారు. టి.మాందాపూర్, చందంపేట గ్రామాల్లోని రైతులకు విత్తనాల వినియోగంపై అవగాహన కల్పించారు.
లైసెన్సులు ఉన్న దుకాణాల్లోనే..
తూప్రాన్/మనోహరాబాద్, మే 27 : విత్తనాల కొనుగోలు విషయంలో రైతులు జాగ్రత్తగా ఉండాలని, లైసెన్సులు ఉన్న దుకాణాల్లోనే విత్తనాలు కొనుగోలు చేయాలని తూప్రా న్ మండల వ్యవసాయాధికారి గంగమల్లు, మ నోహరాబాద్ మండల వ్యవసాధికారి స్ర వంతి అన్నారు. రైతులు తీసుకోవల్సిన జాగ్రత్తల’పై అవగాహన సదస్సు నిర్వహించారు.
సూచనలు పాటించాలి
రామాయంపేట, మే 27 : ఖరీఫ్‌లో పంటలు విత్తుకునే రైతులు వ్యవసాయ శాఖ సూచనలను కచ్చితంగా పాటించాలని రామాయంపేట డివిజన్ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు వసంత సుగుణ అన్నారు. పంటలపై రైతులకు పలు సూచనలు సలహాలిచ్చారు.
నకిలీ విత్తనాలతో నష్టపోవద్దు
చిలిపిచెడ్, మే 27: వానకాలం సాగుకు సన్నద్ధమవుతున్న రైతులు నకిలీ విత్తనాలను తీసుకొని నష్టపోవద్దని మండల వ్యవసాయాధికారి బాల్‌రెడ్డి సూచించారు. రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు.
ఆందోళన వద్దు..
చిలిపిచెడ్, మే 27: రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంక్రమంగా ధాన్యం కొనుగోలు నిర్వాహించాలని తహసీల్దార్ ము సాద్దీక్ అన్నారు. మండలంలోని సోమక్కపేటలో పీఏసీఎస్ ద్వారా చిట్కుల్, గంగారంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలోన్ని ధాన్యం బస్తాలను పరిశీలించారు.
విత్తన కొనుగోలుపై అవగాహన
మెదక్ రూరల్, మే 27 : ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన ఎరువుల దుకాణాల్లో విత్తనాలతో పాటు ఎరువులను తీసుకోవాలని మెదక్ వ్యవసాయ సహాయ సంచాలకులు విజయనిర్మల అన్నారు. మెదక్ మండలంలోని మాచవరంలో రైతులకు విత్తన కోనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
వెల్దుర్తిలో..
వెల్దుర్తి, మే 27 : రైతులు విత్తనాలను కొనుగోలు చేసే సమయంలో సంబంధిత రసీదును తప్పనిసరిగా తీసుకోవాలని వెల్దుర్తి వ్యవసాయ అధికారిణి ఝాన్సీ రైతులకు సూచించారు. యశ్వంతరావుపేట, ఆరెగూ డెం, అందుగులపల్లి, బండపోసాన్‌పల్లి, హస్తాల్పూర్ గ్రామాల్లో రైతులకు అవగాహన సదస్సులను నిర్వహించారు.
చిలిపిచెడ్‌లో..
చిలిపిచెడ్, మే 27 : నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని మండల వ్యవసాయాధికారి బాల్‌రెడ్డి అన్నారు. చిలిపిచెడ్ రైతు ఆగ్రో సేవా కేంద్రం, ఫర్టిలైజర్‌ను తనిఖీ చేసి విత్తనాల శాంపిల్స్‌ను పరిశీలించారు. ఏఈవో రమ్య, ఫర్టిలైజర్ యజమాని శ్రీనివాస్, రైతులు ఉన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oppo F35 | ఒప్పో నుంచి ఎఫ్35, ఎఫ్35 ప్రో ఫోన్లు విడుదల.. అక్టోబర్ 11 నుంచి సేల్
Electrocution | విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి
KTR | రైతుల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది.. గజ్వేల్ ఎమ్మార్వోపై కేటీఆర్ ఆగ్రహం
గరీబ్‌పేట గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

