మహబూబ్‌నగర్ అర్బన్, జూన్ 20 : యోగా అ నేది శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యానికి పునా ది. యోగాసనాలు ఆర్యోగానికి సోపానాలని ఇది ఒత్తిడిని తగ్గించి, ఏకాగ్రతను పెంచుతుందని నిపుణులు సూచిస్తున్నారు. యోగాతో శరీరానికి దేహాదారుఢ్యంతో పాటు మనసుకు ప్రశాంతత లభిస్తుందని, నిత్యం యోగా సాధనతో మెరుగైన ఆరోగ్యం సిద్ధ్ధిస్తుందని సూచిస్తున్నారు. యోగాతో దీర్ఘకాలిక వ్యా ధులకు చెక్ పెట్టవచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నా రు. ప్రతిరోజూ యోగాకు కొంత సమయం కేటాయించడంతో జీవితం ఎంతో ఉల్లాసంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
శరీరం, మనసు ఒకతాటిపైకి తెచ్చి ఆరోగ్య
ప్రయోజనాలు చేకూర్చే ప్రక్రియ యోగా. ప్రస్తుతం ఉరుకులు..పరుగులపై జీవితం యోగా సాధన ఆరోగ్య మంత్రంగా మారిపోయింది. ఆరోగ్యమే మహభాగ్యమంటూ జిల్లా ప్రజ లు యోగా సాధన చేస్తున్నారు. శారీరకంగా దృఢంగా ఉంటే ఏదైన సాధించవచ్చనే ఉద్దేశంతో ఆరోగ్యంపై దృష్టి పెడుతున్నారు. ఈక్రమంలోనే వయస్సుతో సంబంధం లేకుండా నిత్యం యోగా సాధన చేస్తూ ఆర్యోగంగా జీవిస్తున్నారు. విధుల్లో ఒత్తిడి.. మానసిక..శారీరక శ్రమను తట్టుకునేందుకు అందరిబాట యోగానే మారింది. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పాలమూరు జిల్లాలో యోగా సాధనతో కలిగే ప్రయోజనాలపై పలువురు అభిప్రాయాలు..
దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయి..
రిటైర్ట్మెంట్ తర్వాత సమాజ సేవచేయాలనే ఆలోచన తో సుప్రభాత్ హెల్త్‌క్లబ్ జిల్లా కార్యదర్శిగా కొనసాగుతున్నాను. స్వచ్ఛందంగా యోగా కేంద్రాన్ని నిర్వహిస్తున్నా ను. యోగాతో ఆరుపదులు వయస్సులోనూ ఆర్యోగంగా ఉ న్నాను. బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక రోగాలు నియంత్రించే శక్తి యోగాకు ఉంటుం ది. యోగాకు కొంత సమ యం కేటాయిస్తే జీవితాంతం చాలా ఆరోగ్యంగా ఉండగలుగుతాం. కొన్నాళ్లుగా నేను అన్ని వయస్సుల వారికి యోగా సాధన చేయిస్తున్నాను.
– పాండురంగం, సుప్రభాత్ హెల్త్‌క్లబ్ పాలమూరు జిల్లా కార్యదర్శి
జాతీయస్థాయిలో ప్రతిభ..
యోగా శిక్షకుడుగా పనిచేస్తూ రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి జాతీయ స్థా యిలో పోటీలో పాల్గొని ఎన్నో ప్రశంసలు అందుకున్నాను. శ్రీహనుమాన్ యోగా సమితి స్థాపించి యోగా ఆసనాలపై విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్నాం. ఏటా సుమారుగా ఐదు వందల మందికి యోగా నేర్పిస్తున్నాం.
– వెంకటేశ్, శ్రీహనుమాన్ యోగా అసోసియేషన్ వ్యవస్థాపకుడు
కొంత సమయం గడపాలి..
ప్రతిఒక్కరూ మెరుగైన ఆరోగ్యానికి యోగా సాధన చేయాలి. ఎంతటి బిజీ లైఫ్‌లోనూ కొంత సమయం యోగాకు కేటాయిస్తే భౌతిక, ఆధ్యాత్మిక జీవనంలో సమతుల్యత ఏర్పడుతుంది. కొన్నాళ్లుగా యోగా సాధన చేస్తున్నాను.
– రమేశ్, యోగా గురూజీ, కౌకుంట్ల