విరబూసిన సీతా అశోక పుష్పం
జడ్చర్లలోని ప్రభుత్వ డి గ్రీ కళాశాల తెలంగాణ బొటానికల్ గార్డెన్లో అరుదైన సీతాఅశోక మొక్కకు పుష్పం విరబూసింది. అంతరించిపోతున్న మొక్కలలో ఒకటైన సీతా అశోక మొక్కలు తెలంగాణ రాష్ట్రంలో కేవలం నల్లమల అడవుల్లోనే పె రుగుతాయి. ఈ మొక్కను ఆంధ్రప్రదేశ్లోని యోగివేమన యూనివర్సిటీలోని లీడ్ బొటానికల్ గార్డెన్ నుం చి సేకరించి జడ్చర్లలోని తెలంగాణ బొటానికల్ గార్డెన్ లో పెంచుతున్నారు.
- జడ్చర్ల బీఆర్ఆర్ కళాశాలలో వికసించిన అరుదైన మొక్క
- ‘సరాక అశోక’ శాస్త్రీయ నామం
- ‘అసోకారిస్టం’ మందు తయారీ
జడ్చర్లటౌన్, మార్చి 25 : జడ్చర్లలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలంగాణ బొటానికల్ గార్డెన్లో అరుదైన సీతాఅశోక మొక్కకు పుష్పం విరబూసింది. అంతరించిపోతున్న మొక్కలలో ఒకటైన సీతా అశోక మొక్కలు తెలంగాణ రాష్ట్రంలో కేవలం నల్లమల అడవుల్లోనే పెరుగుతాయి. ఈ మొక్కను ఆంధ్రప్రదేశ్లోని యోగివేమన యూనివర్సిటీలోని లీడ్ బొటానికల్ గార్డెన్ నుం చి సేకరించి జడ్చర్లలోని తెలంగాణ బొటానికల్ గార్డెన్ లో పెంచుతున్నారు. ఈ క్రమంలో సీతా అశోక మొ క్క అందమైన ఆకృతిలో పుష్పించిందని గార్డెన్ సమన్వయకర్త డాక్టర్ సదాశివయ్య తెలిపారు. ఈ మొ క్కకు సరాక అశోక అనే శాస్త్రీయ నామం ఉన్నట్లు పే ర్కొన్నారు. ఈ చెట్టులోని ప్రతిభాగం ఔషధమేనని, దీని నుంచి అసోకారిస్టం అనే మందును తయారు చే స్తారని చెప్పారు. మహిళలకు సంబంధించిన వ్యాధు లు నయం చేయడానికి దీన్ని ఉపయోగిస్తారన్నారు. పురాణాల్లోనూ ఈ మొక్క ప్రాధాన్యతను తెలియజేశారని, బుద్ధుడు అశోక చెట్టు కింద జన్మించాడని, అశోకచెట్టు వనంలో సన్యాసం స్వీకరించాడని ప్రతీతి. ఈ చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ శోకం ఉండదని చెబుతుంటారన్నారు. అంతరించిపోతున్న ఈ మొక్కలను కాపాడే క్రమంలో తెలంగాణ బొటానికల్ గార్డెన్లో దీన్ని పెంచుతున్నట్లు సదాశివయ్య తెలిపారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

