ఉత్కంఠ
ఉమ్మడి మహబూబ్‌నగర్ శాసనమండలి ఉపఎన్నిక ఫలితాలు మరో 24 గంటల్లో వెలువడనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నది. ఫలితాలపై అధికార పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ గెలుపు ధీమాతో ఉన్నాయి.
- బ్యాలెట్ బాక్స్‌ల్లో అభ్యర్థుల భవితవ్యం
- రేపే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితం
- ఐదు టేబుళ్ల వారీగా లెక్కింపు
- రెండు గంటల్లో రిజల్ట్
- ఏర్పాట్లు చేసిన అధికారులు
- గెలుపుపై ఎవరి ధీమా వారిదే..
- కౌంటింగ్ సిబ్బందితో ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవి సమీక్ష
మహబూబ్‌నగర్, మార్చి 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి మహబూబ్‌నగర్ శాసనమండలి ఉపఎన్నిక ఫలితాలు మరో 24 గంటల్లో వెలువడనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నది. ఫలితాలపై అధికార పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ గెలుపు ధీమాతో ఉన్నాయి. కాగా ఈ ఉపఎన్నిక ఫలితాలు పార్లమెంట్ ఎన్నికలను ప్రభావితం చేసేలా కనిపిస్తున్నాయి. ఉపఎన్నిక ఫలితాలు నిలిపివేస్తారని.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత లెక్కింపు చేపట్టే అవకాశం ఉందని పుకార్లు వ్యాపించాయి. వీటన్నింటికీ చెక్ పెడుతూ అధికారులు మంగళవారం ఎన్నికల ఫలితాలను వెల్లడించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆదివారం కలెక్టరేట్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవినాయక్ కౌంటింగ్ సిబ్బందితో సమీక్షించారు. కౌంటింగ్ నిర్వహించే బాయ్స్ కాలేజ్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుండగా ఆ ప్రక్రియ ముగిసే వరకు పాలమూరులో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కాగా ఆయా రాజకీయ పక్షాలు ఫలితాలపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
ఐదు టేబుళ్లు.. రెండు గంటల్లో ఫలితం
కౌంటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవినాయక్ పర్యవేక్షిస్తున్నారు. కౌంటింగ్ జరిగే బాయ్స్ కాలేజీలోని హాల్లో ఐదు టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఉదయం 7:30 తర్వాత స్ట్రాంగ్ రూంలను తెరిచి బ్యాలెట్ బాక్స్‌లను ఒక్కొక్కటిగా తీసుకొచ్చి లెక్కించి పక్కకు పెడతారు. ఆ తర్వాత అన్నింటినీ కలిపి ఒక్కో టేబుల్ ద్వారా లెక్కిస్తారు. అభ్యర్థులకు వచ్చిన ప్రాధాన్యత ఓట్లను లెక్కించి గెలుపునకు సంబంధించిన పర్సంటేజీని చూస్తారు. తొలి ప్రాధాన్యత ఓట్లలోనే గెలుపు ఖా యం అనిపిస్తే అప్పటికప్పుడే ఫలితాన్ని ప్రకటిస్తారు. ఒకవేళ తొలి ప్రాధాన్యత ఓట్లలో ఎలిమినేషన్ రౌండ్ ప్రారంభమైతే క్యాండిడేట్ ఎలిమినేషన్ అయ్యాక ఆ ప్రాధాన్యత ఓట్లను లెక్కించి తుది ఫలితాన్ని వెల్లడిస్తారు. ఈ ప్రక్రియ రెండు గంటల్లో ముగిసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
గెలుపుపై ఎవరి ధీమా వారిదే..
మహబూబ్‌నగర్ శాసనమండలి ఉపఎన్నిక తీవ్ర ఉత్కంఠగా సాగింది. ఈ ఫలితం రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే అంశంగా మారనున్నది. అధికార మార్పిడి జరిగాక వచ్చిన తొలి ఎన్నిక కావడం, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండడంతో అందరి దృష్టి ఎమ్మెల్సీ ఫలితంపైనే ఉన్నది. ఉమ్మడి జిల్లాలో స్థానిక ప్రజాప్రతినిధులు మొత్తం 1,439 మంది ఉండగా ఇందులో దాదాపు 70 నుంచి 80 శాతం బీఆర్ఎస్ తరఫున గెలిచిన వారే. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం మారడంతో చాలామంది జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు పార్టీలు మారారు. అయినప్పటికీ మెజారిటీ ప్రజాప్రతినిధులు తమ వైపే ఉన్నారని బీఆర్ఎస్ నేతలు ఏకంగా క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంప్‌లో గెలుపు కోసం అవసరమైన ప్రజాప్రతినిధులు ఉన్నారనే ధీ మాలో ఉన్నా రు. గోవాలో నిర్వహించిన క్యాంప్‌నకు ఏకంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెం ట్ కేటీఆర్ వెళ్లి ప్రజాప్రతినిధులను కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నది. దీం తో అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టా యి. ఫలితం తేడా వస్తే అధికారం వ చ్చిన కొన్నాళ్లకే వ్యతిరేకత ప్రారంభమైందనే సంకేతం వె ళ్తుందని ఆ పార్టీ నేత లు భయపడుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులను ప్రలోభపెట్టి గెలుస్తామనే ధీమాలో కాంగ్రెస్ నేతలు ఊహల్లో
తేలాడుతున్నారు.
పారదర్శకంగా నిర్వహించాలి
- రిటర్నింగ్ అధికారి రవినాయక్
మహబూబ్‌నగర్, మార్చి 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్‌ను పారదర్శకంగా నిర్వహించాలని రిటర్నింగ్ అధికారి రవినాయక్ సూచించారు. ఆదివారం కలెక్టరేట్లో సిబ్బందికి శిక్షణ, కౌంటింగ్ రిహార్సల్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళవారం ఉదయం 8 గంటలకు మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో కౌంటింగ్ ప్రారంభమవుతుందన్నారు. సిబ్బంది 6:30 లోగా రిపోర్టు చేయాలని ఆదేశించారు. సిబ్బంది కౌంటింగ్ టేబుల్స్ వద్ద ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపును ప్రారంభించాలని, ర్యాoడమైజేషన్ ద్వారా సి బ్బందిని ఎంపిక చేస్తారన్నారు. 7:30 గంటలకు స్ట్రాంగ్ రూం
తెరిచి బ్యాలెట్ బాక్సులు కౌంటింగ్ హాల్‌కు తీసుకురావాలన్నారు. ప్రారంభ లెక్కింపులో 10 పోలింగ్ కేంద్రాల్లో నమోదైన ఓట్లను లెక్కిస్తారని, ఆ తర్వాత మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. మొదటి ప్రాధాన్యత ప్రకారం ప్రతి అభ్యర్థి సాధించిన ఓట్లను లెక్కిస్తామని చెప్పారు. అనంతరం మొత్తం చెల్లుబాటు అయిన ఓట్ల సంఖ్య ఆధారంగా గెలుపు కోసం కావాల్సిన కోటా ను నిర్ధారిస్తామన్నారు. అభ్యర్థి కోటాకు సరిపడా ఓట్లను సాధిస్తే గెలుపొందినట్లుగా ప్రకటిస్తామన్నారు. ఏ అభ్యర్థికీ కోటాకు కావాల్సిన ఓట్లు రాకపోతే ఎలిమినేషన్ ప్రక్రియను చేపట్టి ప్రాధాన్యత క్రమం ఆధారంగా ఓట్ల లెక్కింపు జరుపుతామన్నారు. ఈ ప్రక్రియ అభ్యర్థి కోటాను సాధించేవరకు చేపడతామన్నారు. ఏ అభ్యర్థికీ కోటా రానట్లయితే చివరికి మిగిలిన అభ్యర్థి గెలుపొందినట్లుగా ప్రకటిస్తామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు శివేంద్రప్రతాప్, మ యాంక్ మిట్టల్, మోహన్‌రావు, డీఆర్వో రవికుమార్ తదితరులు
పాల్గొన్నారు.
కాళ్లకు కర్రలతో..
ఉగాది పర్వదినం రోజు శ్రీశైలంలోని భ్రామరి, మల్లికార్జునస్వామిని దర్శించుకునేందుకు కన్నడిగులు, మరాఠీలు కాలినకడన వెళ్తున్నారు. శనివారం తన పంట పొలంలో పండిన జొన్నల (50 కిలోలు) బస్తాను మోసుకుంటూ కాలినడకన కర్ణాటక భక్తుడు వెళ్లగా.. ఆదివారం కొందరు భక్తులు కాళ్లకు కర్రలు కట్టుకొని వెళ్లారు. దీంతో శ్రీశైలానికి వెళ్లే దారుల వెంట పాదయాత్ర చేస్తున్న భక్తులే దర్శనమిస్తున్నారు. వీరికి దాతలు అన్నదానం, మంచినీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు, మందులు అందిస్తున్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

