మహబూబ్నగర్ : హైదరాబాద్లో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డితో సినీ నటుడు ఆర్. నారాయణ మూర్తి సమావేశమయ్యారు. ఎమ్మెల్యేతో తెలంగాణలో రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు, రైతుల అభివృద్ధి, రైతుల స్థితిగతులు తదితర అంశాల మీద చర్చించారు. అలాగే రైతన్న సినిమాను కొత్తకోటలోని శ్రీదేవి థియేటర్ లో ఈ నెల 11 నుంచి వారం రోజులు రైతన్న సినిమా నడిపించేందుకు అనుమతి ఇప్పించాలని కోరారు.
ఎమ్మెల్యే వెంటనే స్పందిస్తూ యాజమాన్యంతో మాట్లాడి రైతన్న సినిమా వారంరోజులు నడిపించేటట్లు చూస్తానని, అలాగే దేవరకద్ర నియోజక వర్గంలోని రైతులు అందరూ ఈ సినిమా చూడాలని కోరారు. డిసెంబర్ 11 న ఉదయం 11:30 గంటలకు కొత్తకోట లోని శ్రీదేవి థియేటర్ లో నేను కూడా రైతులతో కలిసి రైతన్న సినిమా చూస్తానని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు.