అయిజ, మార్చి 24 : అయిజ పట్టణంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పంది. మంగళవారం అయిజ పట్టణంలోని మూడు పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ లేకపోవడంతో నో స్టాక్ బోర్డు పెట్టారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో బంకులకు పెట్రోల్, డీజిల్ సకాలంలో చేరకపోవడంతో పెట్రోల్, డీజిల్ లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పెట్రోల్, డీజిల్ కొరత లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో కొరత తీవ్రంగా ఉంది. బంకులకు కంపెనీలు పెట్రోల్, డీజిల్ సకాలంలో అందించకపోవడంతో కొరత ఏర్పడుతుందని వాహనదారులు వాపోతున్నారు. అయిజ పట్టణంలో ఆరు పెట్రోల్ బంకులు ఉండగా, కేవలం రెండింట్లో మాత్రమే దొరుకుతుండడంతో వాహనదారులు ఆయా పెట్రోల్ బంకులకు పరుగులు తీస్తున్నారు.