Maganuru | బూత్‌బంగ్లాగా కుసుమూర్తి విద్యుత్ సబ్‌స్టేషన్.. ప్రమాద ఘంటికలు మోగుతున్నా పట్టించుకోని విద్యుత్ శాఖ
Maganuru | ఒకప్పుడు గ్రామానికి విద్యుత్ సరఫరాలో కీలకంగా ఉన్న కుసుమూర్తి విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రస్తుతం నిర్వహణ లేక అధ్వానంగా మారింది. సబ్‌స్టేషన్ ప్రాంగణమంతా ముళ్లపొదలు, అడవి మొక్కలతో నిండిపోయింది. ప్రధాన గేటు చుట్టూ పొదలు పెరిగిపోవడంతో లోపలికి వెళ్లే దారి కూడా కనిపించని పరిస్థితి నెలకొంది.
Maganuru | మాగనూరు (కృష్ణ), ఆగస్టు 7: ఒకప్పుడు గ్రామానికి విద్యుత్ సరఫరాలో కీలకంగా ఉన్న కుసుమూర్తి విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రస్తుతం నిర్వహణ లేక అధ్వానంగా మారింది. సబ్‌స్టేషన్ ప్రాంగణమంతా ముళ్లపొదలు, అడవి మొక్కలతో నిండిపోయింది. ప్రధాన గేటు చుట్టూ పొదలు పెరిగిపోవడంతో లోపలికి వెళ్లే దారి కూడా కనిపించని పరిస్థితి నెలకొంది.
మరోవైపు సబ్‌స్టేషన్ పరిసరాల్లోని పలు విద్యుత్ స్తంభాలు నేలకు ఒరిగి ప్రమాదకరంగా మారాయి. కొన్ని స్తంభాలు కరెంట్ తీగల ఆధారంగా నిలిచి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గాలులు, వర్షాలు తీవ్రంగా కురిసే సమయంలో అవి ఎప్పుడు కూలిపోతాయోనని రైతులు, గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.
ఏ క్షణంలో ఏం జరుగుతుందో..
ఈ మార్గంలో రైతులు, వ్యవసాయ కూలీలు, వాహనదారులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలు కూలితే ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు తగిన చర్యలు తీసుకోలేదని వారు ఆరోపిస్తున్నారు.

Kusumurthy Substation2
తక్షణమే చర్యలు తీసుకోవాలి
సబ్‌స్టేషన్ ప్రాంగణాన్ని వెంటనే శుభ్రం చేయడంతోపాటు, ఒరిగిపోయిన విద్యుత్ స్తంభాలను తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదకర పరిస్థితులను అధికారులు వెంటనే పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. నిర్లక్ష్యం కొనసాగితే భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

