చివరి ఆయకట్టుకూ సాగునీరు
కోయిల్‌సాగర్ ప్రాజెక్టు చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందిస్తామని దేవరకద్ర, నారాయణపేట ఎమ్మెల్యేలు మధుసూదన్‌రెడ్డి, పర్ణికారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని కోయిల్‌సాగర్ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల నుంచి వారు ఆయకట్టుకు సాగు నీటిని విడుదల చేశారు.
- దేవరకద్ర, నారాయణపేట ఎమ్మెల్యేలు మధుసూదన్‌రెడ్డి, పర్ణికారెడ్డి
- కోయిల్‌సాగర్ కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటి విడుదల
దేవరకద్ర, జూలై 26 : కోయిల్‌సాగర్ ప్రాజెక్టు చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందిస్తామని దేవరకద్ర, నారాయణపేట ఎమ్మెల్యేలు మధుసూదన్‌రెడ్డి, పర్ణికారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని కోయిల్‌సాగర్ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల నుంచి వారు ఆయకట్టుకు సాగు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఎకరాకూ సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎడమ కాల్వ దేవరకద్ర నియోజకవర్గం పరిధిలో వస్తుందని, కుడి కాల్వ నారాయణపేట జిల్లా పరిధిలోకి వస్తుందన్నారు.
ఆయకట్టు కింద ఉన్న దేవరకద్ర, చిన్నచింతకుంట, మరికల్, ధన్వాడ మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన రైతులు సాగు నీటిని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలన్నారు. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు ప్రకృతి సిద్ధంగా కొండల నడుమ ఆహ్లాదకరమైన, అద్భుతమైన వాతావరణంలో ఉందన్నారు. ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ప్రాజెక్టును పర్యాటక స్థలంగా మారుస్తామని చెప్పారు. కార్యక్రమంలో ప్రాజెక్టు చైర్మన్ ఉమామహేశ్వర్‌రెడ్డి, ప్రాజెక్టు ఈఈ ప్రతాప్‌సింగ్, నాయకులు అంజిరెడ్డి, అరవింద్‌కుమార్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, వెంకటేశ్, భరత్, గోపాల్ తదితరులు ఉన్నారు.
సరళాసాగర్ నుంచి నీటి విడుదల
మదనాపురం, జూలై 26 : సరళాసాగర్ ఎడమ కాల్వ ద్వారా సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నీటి తీరవా సంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి మదనాపురం, కొత్తకోట మండలంలోని 10 గ్రామాల రైతులకు ఎడమ కాల్వ ద్వారా సాగునీరు విడుదల చేశారు. ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ సియా ఖండంలోనే మొట్టమొదటి ఆటోమెటిక్ స్టైఫ న్ సిస్టం కలిగిన సరళాసాగర్‌ను టూరిజం స్పాట్‌గా ఏర్పాటు చేస్తామన్నారు. సరళాసాగర్, నెల్విడి, కు రుమూర్తిరాయ లిఫ్టులకు సంబంధించిన మోటర్లు, పైప్లైన్ల మరమ్మతులు చేయించి యాసంగి సీజన్ వరకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామన్నారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ అధికారులు, మండల నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

