సర్కారుకు మా సమస్యలు పట్టవా..
వనపర్తి జిల్లా కేంద్రంలోని జేఎన్టీయూ కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని మంగళవారం కళాశాల విద్యార్థులు కదంతొక్కారు. వనపర్తి, గోపాల్పేట ప్రదాన రహదారిపై 4గంటలపాటు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ జేఎన్టీయూ కొత్త భవనాలు లేక అద్దె భవనంలోనే కొనసాగుతున్నదని, తరగతుల కొరత, ల్యాబ్‌లు, లైబ్రరీ, కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.
- జేఎన్టీయూ విద్యార్థుల నిరసన
- నాలుగు గంటల పాటు వనపర్తిలో రాస్తారోకో
- మద్దతు తెలిపిన బీఆర్ఎస్వీ, పలు విద్యార్థి సంఘాలు
వనపర్తి టౌన్, అక్టోబర్ 22 : వనపర్తి జిల్లా కేంద్రంలోని జేఎన్టీయూ కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని మంగళవారం కళాశాల విద్యార్థులు కదంతొక్కారు. వనపర్తి, గోపాల్పేట ప్రదాన రహదారిపై 4గంటలపాటు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ జేఎన్టీయూ కొత్త భవనాలు లేక అద్దె భవనంలోనే కొనసాగుతున్నదని, తరగతుల కొరత, ల్యాబ్‌లు, లైబ్రరీ, కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. పలుమార్లు వీసీ, రిజిస్ట్ర ర్ల దృష్టికి తీసుకెళ్లి ఎన్ని వినతులు ఇచ్చినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలికల తాత్కాలిక హాస్టల్లో కనీస వసతులు లేవని, టాయిలెట్స్, వాష్‌రూమ్స్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. విద్యార్థు లు సమస్యలపై ప్రశ్నిస్తే ప్రాక్టికల్స్‌లో మార్కులు తగ్గిస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆర్డీవో పద్మావతి, డీఎస్పీ వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థులను శాంతింపజేసి ప్రిన్సిపాల్, రిజిస్ట్రార్‌తో ఫోన్లో మాట్లాడి సమస్యలను వారం రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థినీ విద్యార్థులు ఆందోళన విరమించారు. అనంతరం కళాశాలలోని హాస్టల్ భవనాన్ని పరిశీలించారు. అక్కడ విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు.
బీఆర్ఎస్వీ నాయకుల మద్దతు
జేఎన్టీయూ సమస్యలపై నిరసన తెలుపుతున్న విద్యార్థులకు బీఆర్ఎస్వీ నాయకులు మద్దతు తెలిపారు. కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ భ్రష్టుపట్టిందని బీఆర్ఎస్వీ జిల్లా కో-ఆర్డినేటర్ హేమంత్, పట్ట ణ, మండల అధ్యక్షులు గిరి, రాములు అన్నా రు. కళాశాల యాజమాన్యం విద్యార్థులకు ఇచ్చిన హామీలను వారం రోజుల్లో పరిష్కరించకపోతే బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. అదేవిధంగా బీజేపీతోపాటు పలు విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులకు మద్దతుగా ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

