శ్రీశైలానికి కృష్ణమ్మ పరుగులు
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో జూరాలకు వరద నీరు వచ్చి చేరుతున్నది. సోమవారం రాత్రి వరకు ప్రాజెక్టుకు 1,70,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తున్నట్లు అధికారులు తెలిపారు.
- జూరాలకు పోటెత్తిన వరద
- 37 గేట్ల ద్వారా 1,45,003 క్యూసెక్కుల నీటి విడుదల
- జలవిద్యుత్ కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుదుత్పత్తి
- టీబీ డ్యాం మూడు గేట్ల ఎత్తివేత
గద్వాల, జూలై 22 : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో జూరాలకు వరద నీరు వచ్చి చేరుతున్నది. సోమవారం రాత్రి వరకు ప్రాజెక్టుకు 1,70,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టులోని 37గేట్లు ఎత్తి 1,45,003 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ జూరాలలో ఐదు, దిగువ జూరాలలోని ఆరు యూనిట్లలో విద్యుదుత్పత్తి కొనసాగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పూర్తి స్థాయి నీటిమట్టం 318.516మీటర్లు కాగా ప్రస్తుతం 317.490 మీటర్లుగా ఉన్నది. పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.627 టీఎంసీలుగా ఉన్నది. కాగా, విద్యుదుత్పత్తికి 28,292 క్యూసెక్కులు, నెట్టెంపాడ్ లిఫ్ట్‌నకు 1,500, భీమా లిఫ్ట్-1కు 1,300, ఎడమ కాల్వకు 640, కుడి కాల్వకు 584 క్యూసెక్కులను విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు నుంచి మొత్తం 1,77,361 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదవుతున్నది. కాగా, నారాయణపూర్ డ్యాం వద్ద 25 గేట్లు ఎత్తగా దిగువకు 1,44,250 క్యూసెక్కులు జూరాలకు చేరుతున్నాయి.
పరవళ్లు తొక్కుతున్న తుంగభద్ర..
అయిజ, జూలై 22 : తెలంగాణ రాష్ట్రంలోకి తుంగభద్ర మ్మ వడివడిగా అడుగులేస్తున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలకు టీబీ డ్యాంకు వరద ప్రవాహం పెరుగుతుండడంతో సోమవారం కర్ణాటకలోని హోస్పేట్లోని తుంగభద్ర డ్యాం 3 క్రస్ట్ గేట్లు ఒక అడుగు మేరకు ఎత్తి దిగువకు నీటిని తుంగభద్ర నదిలోకి విడుదల చేస్తున్నారు. దీంతో తుంగభద్రమ్మ పరవళ్లు తొక్కుతూ ఆర్డీఎస్, సుంకేసుల, శ్రీశైలం వైపు అడుగులు వేస్తున్నది. టీబీ డ్యాంలోకి ఇన్‌ఫ్లో 1,03,891 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 13,365 క్యూసెక్కులుగా నమోదైంది. 105.788 టీఎంసీల సామర్థ్యం కలిగిన టీబీ డ్యాం లో ప్రస్తుతం 88.358 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, 1633 అడుగుల నీటి మట్టానికి గానూ 1628.45 అడుగులు ఉ న్నట్లు టీబీ డ్యాం సెక్షన్ అధికారి రాఘవేంద్ర తెలిపారు. సా యంత్రం 4 గంటలకు టీబీ బోర్డు సెక్రటరీ ఓఆర్కే రెడ్డి 3 గే ట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేశారు. టీబీ డ్యాంకు రాత్రి ఇన్‌ఫ్లో పెరిగితే మరిన్ని గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉందని చెప్పారు. నదీతీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టీబీ బోర్డు ప్రమా ద హెచ్చరికలు జారీ చేసింది. టీబీ డ్యాం నుంచి ఆర్డీఎస్ ఆనకట్టకు బుధవారం వరద నీరు చేరుకుంటుందని, అక్కడి నుంచి సుంకేసుల మీదుగా, శ్రీశైలం ప్రాజెక్టుకు తుంగభద్ర జలాలు చేరుకుంటాయని ఆర్డీఎస్ ఏఈ రాందాస్ తెలిపారు.
శ్రీశైలానికి లక్షకు పైగా క్యూసెక్కుల ఇన్‌ఫ్లో..
శ్రీశైలం, జూలై 22 : శ్రీశైలం జలాశయానికి వరద క్రమక్రమంగా పెరుగుతున్నది. ఎగువన జూరాల ప్రాజెక్టు నుంచి నీటి విడుదల జరగగా.. సోమవారం రాత్రికి శ్రీశైలం డ్యాం కు 1,10,304 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుత నీటినిల్వ 833.60 అడుగులు ఉండగా.. సామర్థ్యం 215 టీఎంసీలకుగానూ ప్రజెంట్‌గా 53.3713 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఏపీ, టీఎస్ పవర్హౌస్ల్లో విద్యుదుత్పత్తి ప్రారంభం కాలేదు.
కొనసాగుతున్న పంపింగ్..
మక్తల్, జూలై 22 : కృష్ణానదికి భారీ వరద వస్తున్న నేపథ్యంలో భీమా ఫేజ్-1లో అంతర్భాగమైన చిట్టెం నర్సిరెడ్డి (సంగంబండ), భూత్పూర్ రిజర్వాయర్లకు పంపింగ్ కొనసాగుతున్నది. మక్తల్ మండలం చిన్నగోప్లాపూర్ వద్ద భీమా ఫేజ్-1 స్టేజీ-1 పంప్‌హౌస్ నుంచి 1300 క్యూసెక్కుల నీటి ని రెండు మోటర్ల ద్వారా పంపింగ్ చేస్తున్నారు. వీటి నుంచి భూత్పూర్ రిజర్వాయర్‌కు 500 క్యూసెక్కులు, చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు 800 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తున్నారు. చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో 3. 317 టీఎంసీల సామర్థ్యం ఉండగా ప్రస్తుతం 1.66 టీఎంసీలకు చేరింది. దీంతో సంగంబండ నుంచి మెయిన్ కెనాల్‌కు సాగునీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

