మూసాపేట, మే 22 : తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌పై ఉన్న అభిమానంతో కేసీఆర్ చిత్రాన్ని అడ్డాకుల మండలంలోని కందూరు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త నక్క రమేశ్ తన కుడి చేతిపై పచ్చ బొట్టు వేయించుకున్నాడు. శుక్రవారం దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డితోపాటు కందూరు గ్రామస్తులు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సమయంలో కేసీఆర్ సార్ అంటే చాలా ఇష్టమని, అందుకు సార్ చిత్రాన్ని చేతిపై పచ్చబొట్టు వేయించుకున్నానని చెప్పడంతో కేటీఆర్ నక్క రమేశ్‌ను ఆప్యాయంగా కౌగిలించుకొని అభినందించారు. మీలాంటి వారి అభిమానం వల్ల కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని కొనియాడారు. వారి వెంట బీఆర్ఎస్ అడ్డాకుల మండల అధ్యక్షుడు తోకల శ్రీనివాస్‌రెడ్డి, రమేశ్‌గౌడ్, శ్రీనివాసులు, చంద్రమౌళి పాల్గొన్నారు.