అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశాలు
నాగర్‌కర్నూల్, జూలై 21 : తన పేరు తో కొద్ది రోజులుగా వస్తున్న ఫేక్ మెసేజ్‌లపై నాగర్‌కర్నూల్ జిల్లా ఉన్నతాధికారు లు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఉదయ్‌కుమార్ సూచించారు.
జిల్లా కలెక్టర్ ప్రొఫైల్ ఫొటో, 8278450979 నుంచి వాట్సాప్ ద్వారా పలు ఆదేశాలు, సూచనలు వెలువడుతున్నాయని, వీటితో జిల్లా యంత్రాంగానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. దీనిపై ఇప్పటికే పో లీసులకు సమాచారాన్ని అందజేశామని చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.