ఈ క్షణాలు
ఇన్ని క్షణాల్ని ముత్యాల్లా వొంపుకుని చిన్ని కిటికీలోంచి ప్రపంచాన్ని తెరుచుకుని సమయాల్ని అలంకరించుకుంటాను జ్ఞాపకాలు పావురాల్లా వాలుతాయి మంచు దృశ్యాలు పరుచుకుంటాయి రాత్రులు వేలాడుతూ
ఇన్ని క్షణాల్ని ముత్యాల్లా వొంపుకుని
చిన్ని కిటికీలోంచి ప్రపంచాన్ని తెరుచుకుని సమయాల్ని అలంకరించుకుంటాను
జ్ఞాపకాలు పావురాల్లా వాలుతాయి
మంచు దృశ్యాలు పరుచుకుంటాయి
రాత్రులు వేలాడుతూ
స్వప్న లోకంలో
ఆశల్ని రుచి చూపుతాయి
మౌన క్షేత్రాలు
మనసును తేలిక పరుస్తాయి
ప్రణాళికలు
మనిషిని క్రమబద్ధీకరిస్తాయి
ఉత్సాహాలు మేల్కొని
ఆరోగ్యమయ ప్రపంచంలో
విజయ తీరాలను చేరుస్తాయి
నిరంతర శ్రమ
పరిశ్రమ ఆత్మ విశ్వాసాన్ని నిలిపి
చెదిరిపోని కలల్ని
దృశ్యాలుగా ఆవిష్కరించి
నిలుపుతుంది.
-గవిడి శ్రీనివాస్
70192 78368
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

