తళతళ
అతను వినువీధిలో తారకలను పొదిగి అంబరంపై మెరుపుల నేత నేసి పచ్చని సింగారాలద్దిన మట్టిబంతిని సంద్రాలలో చుట్టి కిందికి దింపాడు తన ఆటవిడుపు కోసం
అతను వినువీధిలో తారకలను పొదిగి
అంబరంపై మెరుపుల నేత నేసి
పచ్చని సింగారాలద్దిన మట్టిబంతిని
సంద్రాలలో చుట్టి కిందికి దింపాడు
తన ఆటవిడుపు కోసం
నరుడు నరేతరాల కల్పనతో
సవ్వడి తరంగాలను,
కాంతిరేఖలను గుమ్మరించాడు
ఏ ఏమరుపాటునున్నాడో
తనకు పోటీదారులను
కొందరిని జారవిడిచాడు
గోడలపై తెల్లని కాగితాలపై
చేస్తున్న ప్రతి సృష్టికి నిశ్చేష్ఠుడై
తోలుముక్కల లోంచి
చెక్కపెట్టెల లోంచి
లోహ వస్తువుల లోంచి
అవతరిస్తున్న నాదాలకు, రవళులకు
సమ్మోహితుడవుతున్నాడు
అలంకారాలు నిండిన పొగడ్తలకు,
వర్ణనలకు ఉబ్బితబ్బిబ్బై
తొలుస్తున్నా చెక్కుతున్నా ఓర్చుకొని
మౌనంగా ఒదిగి మలిచినట్టుగా
రూపుదిద్దుకుంటున్నాడు
ఒక్క కనుదోయిలో నిప్పురవ్వలు.
మోహానురాగాలు
భయవిభ్రాంతులు క్షణాల్లో మారే
దృశ్యానికి విస్మయుడవుతున్నాడు
ఆనందోబ్రహ్మ!
కళ దైవదత్తం కాదీ వేళ
అది దైవసమానం
ఇపుడు అతడు గర్వి
వీరి సృజనకే తన భుజమెత్తుకొని.
-డా.కాచాపురం దుర్గాదేవి
7893093495
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
- Tags
- literature news
- poem
- poetry
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

