మట్టంటకుండా
మనం గుమ్మం బయట విడిచేస్తాం మనల్నెప్పుడూ గుండెల్లోనే పెట్టుకుంటాయి
మనం గుమ్మం బయట విడిచేస్తాం
మనల్నెప్పుడూ గుండెల్లోనే పెట్టుకుంటాయి
గుడి బయట విడిచినా గుమ్మం బయట విడిచినా
ఏమీ నొచ్చుకోక కాళ్లు ముందుకు జరపగానే
జోడెడ్లు కాడి మీదేసుకున్నట్టు
పాదాల్ని మీదేసుకుని
బాధ్యతగా బయలుదేరుతాయి
ఎన్నిసార్లు తెగినా గుప్పెడు కుట్లేసుకుని
తెగని బంధంలా కాళ్లను చుట్టేసుకుని మురిసిపోతాయి
కొత్తవి కొనలేని పేదరికానికి
అరిగీ కరిగీ ఒళ్లంతా తూట్లు పడినా
చివరి రక్తపు బొట్టును కూడా
మన క్షేమానికే ధారపోసినట్టు
మళ్లీ మళ్లీ ప్రాణం పోసుకుని
పంటి బిగువున పల్లకీలా మోస్తాయి
చేరదీసిన కాళ్లను గుండెల్లో పెట్టుకుని
క్షేమంగా ఊరేగించటమే
వాటికి తెలిసిన ప్రేమ విద్య
అప్పుడప్పుడూ
మన కోపానికి ఆయుధాలు గానూ
నిండు సభలో అవినీతి రాజకీయ నాయకులకు
నిరసనతో చెప్పుదెబ్బలు గానూ మారుతాయి
మనుషుల్లా నమ్మించి గొంతుకోయవవి
ముళ్లు గుచ్చుకున్న సంగతి కూడా
మూడో కంటికి తెలియకుండా
మనల్ని నిత్యం కాపాడుతాయి
ముళ్లు చేసిన గాయాలెన్నిటినో
తమలోనే గుట్టుగా దాచుకుని
పాదాలను పసిపిల్లల్లా కాపాడుతూ
మనుషుల్ని మట్టంటకుండా గమ్యాన్ని చేరుస్తాయి!
చిత్తలూరి
91338 32246
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

