కల్లు గీత
నేను తాళ్లల్లో తారాడుతూ పెరుగుతున్న క్రమంలో కులపోళ్లంతా తాళ్లెక్కుతుంటే నిశితంగా గమనించే నా కళ్లు అస్ర్తాల పొది ముస్తాదు పైనే
నేను తాళ్లల్లో తారాడుతూ
పెరుగుతున్న క్రమంలో
కులపోళ్లంతా తాళ్లెక్కుతుంటే
నిశితంగా గమనించే నా కళ్లు
అస్ర్తాల పొది ముస్తాదు పైనే!
మనసంతా దాని సృష్టి లోగుట్టు పైనే!
నా ఊరి తోలు శాస్త్రవేత్త
తోలు వలిచి నానబెట్టి
సున్నం పూసి ఆరబెట్టి ముస్తాదు చేస్తున్న చేతుల్లో కళ
మరో వృత్తిని నిలబెట్టిందనే సత్యం నేనెరిగింది!
కొలిమిలో మండుతున్న ఇనుప కడ్డీల ఎరుపు
మలచబడబోతున్న కత్తుల పదునుకే తెలుసు
అన్నీ కత్తులే! అన్నీ కోసేవే! మట్టలు నరికేది! గెల గీసేది! ముంజలు కొట్టేది!
తేడా గీసే వాడికే ఎరుక
వాడు చెబుతుంటే వంపులు వాలులు సరిసే కమ్మరి నైపుణ్యం! గీత వృత్తికే పునాదిరాయి!
తాటి నారతో పేనిన మోకు
గర్రి మట్ట తడపల చుట్టుతో స్వహస్తాలతో తయారు
నడుము చుట్టూ పెనవేసుకుని పోగా
కాళ్ల బంధం ఆసరాగా ఎక్కుతుంటే
అరచేతులు పాదాలు కంది ఆన్లై
బాధిస్తున్నా ఆగదు జీవన పోరాటం!
కోడి కంటే ముందే లేచి
ముస్తాదు నడుముకి బిగించి కట్టుకుని
నక్షత్రాలు దారి చూపుతుంటే
బతుకు యుద్ధానికి వెళ్తున్న కార్మికుడిని!
ఆకురాయితో కత్తుల పదును పెట్టుకుని
పైపైకి ఎగబాకుతుంటే ఎవరెస్ట్ను ఎక్కేస్తున్న భావన
పోతు పరుపు తాళ్ల ఎడ గీత సంధ్య రాకముందే ముగింపు!
గీతలో ఆరితేరిన నేను ఒడిసే ఒక్కో బొట్టు లొట్టిలో రాలుతుంటే నా కళ్లు ఆనందబాష్పాలు రాల్చు!
ఆకాశాన్నంటిన చెట్టు నా కోసమే గెట్టున
నిరీక్షించే ప్రియురాలు!
రాత్రంతా తాను రాల్చిన పాలు ఒడిసి పట్టిన లొట్టి పొంగేలోపే నేను రావాలనే ఆశతో నా దారి వైపు చూపు
ఒక్కో చెట్టు ఒక్కో గెల గీసే గీత వైవిధ్యం
పారే కల్లు రుచి భిన్నం!
అనుభవంతోనే గీతలో గొప్పదనం రాటు దేలు!
-గిరి ప్రసాద్ చెలమల్లు
94933 88201
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

