సందడి తొవ్వ
పొద్దుగాళ్లనే తూరుపు దిక్కున సూరీడు పొడవడం యాది మరుస్తడేమో గానీ ఎర్ర రంగు కండువా భుజానేసుకుని కిర్రు కిర్రు చెప్పుల జోళ్లు ఎర్రెర్ర ఫ్రేము కళ్ళజోడు తొడుక్కుని గలమలోంచి కాళ్లు బయటకేసి సూరయ్యనే నిద్ర లేపేటోడు మా నాయన
పొద్దుగాళ్లనే తూరుపు దిక్కున
సూరీడు పొడవడం
యాది మరుస్తడేమో గానీ
ఎర్ర రంగు కండువా భుజానేసుకుని
కిర్రు కిర్రు చెప్పుల జోళ్లు
ఎర్రెర్ర ఫ్రేము కళ్ళజోడు
తొడుక్కుని గలమలోంచి
కాళ్లు బయటకేసి
సూరయ్యనే నిద్ర లేపేటోడు
మా నాయన
చీకటి
తెరలు తెరలుగా జారిపోతుంటే
ఆయన వాగొడ్డుకెల్లెందుకు
వెలుగు పులుగు లెక్క
రెక్కలు కట్టుకునేటోడు
దారిపొంట యాప్పుల్ల నముల్తు
మూడు మామిడి పిందెల అగ్గిపుల్లతో
దోస్తు బీడీని దోస్తులతో కలిసి
ఏఎన్నార్లా ఎలిగించేటోడు
నిజంగా నాయన మాకు హీరోనే
పట్టెడ మీద సుత్తితో కొట్టీ కొట్టీ
కుంపటి మంటల భగ భగలోనూ
కూనిరాగాలు తీస్తుంటే…
చెమట చుక్కలు సైతం
సిగ్గు బిళ్లల్ని కట్టేటియి
సిరాకు మంటను
కొడగొట్టంతో ఊదుతూ ఉంటే
అయ్య గుండె బొండిగల నుంచి
జారుతుందనిపించేది
గాలి తిత్తులతో విన్యాసం చేస్తూ
గజ్జెల్ని అతకటం చూస్తుంటే
శిఖరం అంచున
శివ తాండవం గుర్తొచ్చేది
పొద్దు గుంకంగనే
కాస్తంత కెంపేసుకుని
కల్జు వాయికాలతో
కాలానికి నిచ్చెన్ను కట్టి
ఉసుల్తో ఉయ్యాలలూగేటోడు
బంగారు నగకు వనమ పెట్టినట్టే
నడతకు నాణ్యతనద్ది
బెత్తెడు సంతోషాన్ని
కమ్మెచ్చుతో సాగదీసి
బారెడు బతుకుల్లో పంచేటోడు
సన్న సన్న సమస్యల సత్తు ముక్కల్ని
సవనంతో తీసి దూరంగా పడేసి
ధన్వంతరిలా దర్శన మిచ్చేటోడు
బంధుత్వ గొలుసులు తెగకుండా
పట్టకారుతో పట్టి పదిలం చేసే
పెద్ద పనోడు ఆయన
ఊడ్చిన మసికట్టు నుంచి
అణువణువూ వడపోసి
స్వర్ణాన్ని వెలికితీసి ఒడిసి పట్టినట్టు
బొట్టు బొట్టు కన్నీటి నుంచి
బ్రతుకు బంగారాన్ని పట్టుకుంటోడు
నా ఎరుకలో యాడాదికోమారు
ఇంటిముందు వసారా కింద
రుంజోళ్ల సప్పుడు
మహా రంజుగా సాగేది
దిమ దిమ దరువంటే అదే మరి
సంబురాల రోజులన్నీ
ఏ రివాజు లేకుండానే
చెల్లాచెదురైనయ్
అయ్య తిరిగిరాని
లోకానికి తరలిపోయాక
కాలం గిర్రున తిరిగి
బ్రతుకు కావడిని మోయించింది
దిగులు బావిలో
దుఃఖాన్ని చేదుకుంటున్న
అవ్వనిప్పుడు ఒంటరిగా
పాతింట్ల సూత్తాంటే
నాయిన పరిచిన
సందడి తొవ్వ
యాదికొస్తాంది..!
-డాక్టర్ కటుకోఝ్వల రమేష్
99490 83327
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

