ఆ చల్లని సముద్ర గర్భం
కలం యోధుడా.. కావ్య ధీరుడా.. మహానది పయోనిధీ దాశరథీ.. శరథీ.. రథీ
కలం యోధుడా.. కావ్య ధీరుడా..
మహానది పయోనిధీ దాశరథీ.. శరథీ.. రథీ…!
నీ కల నవలోకనం నీ కళ అవలోకనం
నీ వాక్యమొక శరం నీ వ్యాఖ్యానమొక వరం
ఓ ఆకాశవాణి ప్రయోక్త ఓ ఆకాంక్షల వాణి ప్రవక్త
నీ చేతిలో బొగ్గు ముక్క నినాదమై మండే అగ్గి చుక్క
నీ జననం తెలంగాణ నీ పయనం రుద్రవీణ
నీ కవనం అగ్నిధార నీ మరణం అశ్రుధార
ప్రగతిబాట నీ అడుగు జగతితోట నీ గొడుగు
తెలుగుదనపు గిడుగు అక్షరజ్వాలా పిడుగు
ఓ గజల్ కావ్య రుబాయి గాలిబ్ గీతాల భాయి
మహాంధ్రోదయ తురాయి మహోద్యమ సిపాయి
నీ తిమిరంలో సమరం తేనెలూరు తెలుగుదనం
నీ అభిమాన పునర్నవం ఆశయాల వెలుగు వనం!
ధ్వజమెత్తిన ప్రజాగొంతు శివమెత్తిన శ్రీమంతు
అణచబడ్డ నిజాం అహం గర్జించిన కవి సింహం
కవన వనాల కవితా పుష్పకం యాత్రాస్మృతుల మస్తకం
మిన్నేటి పొంగుల దీప్తి ప్రణవ నాథుని అక్షర స్ఫూర్తి
నీ బాలల గేయాల భవిత రీతి సున్నిత భావ హృదయ గీతి
నీ ఆలోచనా లోచనాల ఆర్తి స్తుతి అకుంఠిత సంకల్ప స్మృతి
-డాక్టర్ కటుకోఝ్వల
రమేష్ 99490 83327
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

