పోరుకవికి వందనాలు
వందనాలు వందనాలు మహారథికి వందనాలు దాశరథికి వందనాలు జోహారు జోహారు
వందనాలు వందనాలు
మహారథికి వందనాలు
దాశరథికి వందనాలు
జోహారు జోహారు
విప్లవ కవి విరించికి జోహారు
విశాల హృది ధీశాలికి జోహారు
ఉగ్గుపాల పంతం
నిగ్గదీయు నైజం
ఆ నిరంకుశ నైజాము
మెడలు వంచు ధైర్యం
పీడితులకు తాడితులకు
అండ నిలుచు సైన్యం
భూస్వాముల కక్షలు
తెగటార్చు ఖడ్గం
కవనంతో కవాతు
కల్లోలం జవాబు
గుండుకెదురు
గుండె నిలుపు తేజం
ప్రాణమంటే త్రుణము
తన శ్వాసే రణము
మరణమంటే లేదు భయం
అండ నిలుచు అభయం
ఉగ్గు పాల పంతం
నిగ్గదీయు నైజం
నిరంకుశ నైజాం
మెడలు వంచు ధైర్యం
పందొమ్మిదేళ్ళ యువకుడు
సాహిత్య వార్షికోత్సవ
ఓరుగల్లు సభలో
గాండ్రించిన వైనం
ఉరితీసి పిరికితనం
నూరిపోసే ధైర్యం
రజాకార్లకే రంధియై
ఉద్యమానికి ఊపిరియై
గొంతెత్తిన వీరుడు
చురకత్తులే మాటలు
సంకెళ్లకు వెరువక
జైళ్లంటే బెదరక
ఉగ్గు పాల పంతం
నిగ్గదీయు నైజం
ఆ నిరంకుశ నైజాము
మెడలు వంచు ధైర్యం
అగ్నిధార నిప్పు కణిక
నిద్ర లేపె జగమంత
నియంత అంతమిక
రుద్రవీణ తంత్రులు
మీటె హృదయ తంత్రులు
పాడే విప్లవ గీతికలు
తిమిరంతో సమరం
నవోదయ గగనం
ఉషోదయ కిరణం
ఎక్కు పెట్టి రణశరం
వీణ పాటల కాణాచి
వీనులకెంతో అభిరుచి
సాహిత్యపు శిఖరం
లోతైన భావ గర్భితం
పూరించే సమర శంఖం
ఉద్యమ ఉగ్ర సింహం
సల సల మరిగే రక్తం
ఉగ్గు పాల పంతం
నిగ్గదీయు నైజం
ఆ నిరంకుశ నైజాము
మెడలు వంచు ధైర్యం
ఇదే ఇదే నివాళి
శత జయంతి సంబరానికి
దిగ్విజయ అంబరానికి
తెలంగాణ విప్లవరథికి
మానవీయ మహారథికి
మన దాశరథికి
-మర్రి బాల్ రెడ్డి
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

