ఎన్ని సార్లు చెప్పాలి
చీకటి రాత్రిలో ఒంటరిగా నిలబడ్డాను ఆకాశం మీది చుక్కలు కండ్ల ముందే అదృశ్యమయ్యాయి నా మనసు రంగుల ప్రపంచాన్ని‘కల’గంటుంది!
చీకటి రాత్రిలో
ఒంటరిగా నిలబడ్డాను
ఆకాశం మీది చుక్కలు
కండ్ల ముందే అదృశ్యమయ్యాయి
నా మనసు
రంగుల ప్రపంచాన్ని‘కల’గంటుంది!
నేను కొత్త సామ్రాజ్యాన్ని
నిర్మించుకున్నాను
నీతో పనిలేదు..
నేనే ప్రపంచాన్ని
నేనే స్వప్నాన్ని
చిరు నవ్వును
రహస్యంగా దాచాను!
పిరికితనం
బలహీనత
అబద్ధాలు
నాకు శత్రువులు
నా ఎడబాటును
ఎదురుచూస్తున్న కాలం!
చీకటిలో మిణుగురును
ప్రమాదం లేని వెలుతురును
అప్రమత్తతతో ప్రయాణిస్తాను
గమ్యం చేరే వరకు నిరీక్షిస్తాను
మృత్యువుతో రాకు అని
ఎన్నిసార్లు చెప్పాలి!!
– ఎదిరెపల్లి కాశన్న
9640006304
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
- Tags
- confidence
- human
- NT Kavithalu
- poem
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

