గడ్డి ఆకులు
చిల్లగింజలు మలినాలను వేరుచేసినట్టు మనలోని లోపాలను జ్ఞానం తీసేస్తుందట పైకి శుభ్రరూపు లోపల వింత విభ్రమాలు
చిల్లగింజలు మలినాలను వేరుచేసినట్టు
మనలోని లోపాలను జ్ఞానం తీసేస్తుందట
పైకి శుభ్రరూపు లోపల వింత విభ్రమాలు
గ్రూపులు కట్టే యాపులు చేసే
ఈ ఆలోచనా దరిద్ర జగత్తులో
హావభావాలు స్వభావ వ్యత్యాసాలు
మనస్సునేం పవిత్రం చేస్తాం కానీ
అజ్ఞాన పంకంలో పడిపోకుండా చూస్తే చాలు
హృదయ పలక మీద రాస్తే చాలు
గరికలో దర్భలో నిమ్మగడ్డో పార్లర్ వైన్స్ అయినప్పుడు
గొడ్లకు తిండే కాదు నేల రక్షణకు
గడ్డి ఆకులు ప్రాణప్రదాలు
గుండె గాయాల మాటేమో కానీ…
ఒంటి గాయాలను నయం చేసే
నయా యాంటీబయాటిక్స్కు ఇవే ఆధారాలు
నూనెల్లోని పరిమళాలకు
వంటల్లోని బలాలకూ తేలికపాటి గడ్డి చాలు
సైప్రస్ జాతివన్న కొత్త శాస్త్ర నామమేమో గాని
తుంగ గడ్డి మహా పూర్వపు గడ్డే!
చెడు ఆలోచనల మురికినేం తీయగలం కాని
చెత్తాచెదారం ఊడ్చిపారేసే కొండచీపుర్ల
బ్రూమ్ గ్రాస్ మహాశ్చర్య విశేషం!
హారీపాటర్ పట్టుకుని ఆడిన ‘క్విడిచ్’ ఆటలే కాదు
సాలీళ్లూ బొంతపురుగులూ
చీపురు గడ్డి వాసనకు బెంబేలెత్తిపోతాయట!
గడ్డే కదాని కొట్టిపారేయకండి
విటమిన్లు తయారుచేసే ఉపయోగాలట!
స్టైలిష్గా తయారుచేసే జ్యూస్లూ తాగేస్తాం
రసోత్పాదక కారకమయ్యే గడ్డీ ఉన్నదట!
పూబంతులిష్టపడే చేమంతులూ గడ్డి జాతే!
‘పలకాకు’ పేరు గమ్మత్తుగా ఉన్నది కదూ…
అక్షరాల స్పష్టతకే కాదు నల్లబల్లతో స్నేహాలే కాదు
తెల్లజుట్టు నల్లగా మార్చే మాయనట!
ఇబ్బందులు పెట్టే దెబ్బల మచ్చలు మటుమాయమయ్యే
మర్మౌషధమూనట!!
కసవు తినే పశువులకన్నా హీనులున్న లోకంలో
పచ్చని గ్రాసం తిని పాలనిచ్చే గుణోత్తమ జాతి అది
బ్రతుకు తెరువు తృణమో పణమో కోరుతుందంటారే..
పణమంటే ధనము తృణమంటే గడ్డి!
తృణమేనని తేలిక చేయొద్దు!!
ఏనుగునూ కట్టేసే తాడూ తయారౌతుంది!!
సర్ప రజ్జు భ్రాంతిలో ఉన్న మనిషికీ
పుట్టుక బంధాల నుండి
చావు కట్టు కోసమూ గడ్డి అవసర వస్తువు
ఈ చలన రహిత స్థితి ఎప్పుడొస్తుందో తెలియక
నీతి లేని వాళ్లు గడ్డిని తింటారు
గాతి అంటే గ్రాసం…గ్రాసమంటే తిండి!
గాతి లేకుంటే గతి లేదు గాని
రుచి అరుచుల తేడా తెలిసిన జాతి కదా అనే చింత!!
జాతి అశౌచాలూ మృత అశౌచాలనే తేడాలు మరచి
గడ్డి అవసరమయ్యే చివరి రోజుల్నీ మరిచి
మరపు గుడ్డ కప్పుకొని
లంచావతారాలెత్తుతారు కొందరు!
తలవంచని గుణాల ప్రతీకలలో
గడ్డిపరక ఆత్మవిశ్వాసం పక్షాన నిలిచే
ఏకైక ఆయుధం తృణ ఆయుధం!!
గడ్డి ఆకులు గర్వానికి ధీటు!!
ప్రకృతి సౌందర్యానికి చక్కని పలకరింపు!!
గిరి వరప్రదాయినులైన ఆకులెన్నో చెట్లెన్నో!!
పోగొట్టుకున్న చోటే వెతకాలంటారు
నేలమ్మ పచ్చగ నవ్వినప్పుడే జీవనోత్సవ హేల!
పర్యావరణ అనుకూలతనే నీదైన సానుకూల సరళి!!
-డాక్టర్ కొండపల్లి నీహారిణి
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

