ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో

ఈ నల్లని రాలలో
ఏ కన్నులు దాగెనో
ఈ బండల మాటున
ఏ గుండెలు మ్రోగెనో ॥ఈ॥
పాపాలకు తాపాలకు
బహుదూరములో నున్నవి
మునులవోలె కారడవుల
మూలలందు పడియున్నవి ॥ఈ॥
కదలలేవు మెదలలేవు
పెదవి విప్పి పలుక లేవు
ఉలి యలికిడి విన్నంతనె
గలగలమని పొంగిపొరలు ॥ఈ॥
పైన కఠినమనిపించును
లోన వెన్న కనిపించును
జీవమున్న మనిషికన్న
శిలలే నయమనిపించును ॥ఈ॥
1964 నాటి ‘అమరశిల్పి జక్కన’ సినిమాలోని ఈ ప్రఖ్యాత గీతం వాస్తవానికి ‘రామప్ప’ అనే సంగీత రూపకంలోనిది. 1959లో సినారె రచించిన ఈ సంగీత రూపకం తెలుగులోనేగాక, దేశంలోని మరో 13 భాషల్లోకి అనువాదమై ఆకాశవాణి కేంద్రాల నుంచి ప్రసారమైంది. రామప్ప శిల్పసంపదను చూసి న తన్మయత్వంలో సినారె సంగీతరూపకాన్ని రచించారు.
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

