స్ఫూర్తి తెలంగాణ
అవమానాలు అణచివేతలపై పిడికిలి బిగించిన నేల స్వేచ్ఛగీతానికి ఉద్యమ స్వరాలద్దిన పోరుభూమి సర్వమతాలు, జాతి సంస్కృతులకు నెలవైన అమ్మఒడి
అవమానాలు అణచివేతలపై పిడికిలి బిగించిన నేల
స్వేచ్ఛగీతానికి ఉద్యమ స్వరాలద్దిన పోరుభూమి
సర్వమతాలు, జాతి సంస్కృతులకు నెలవైన అమ్మఒడి
స్వరాష్ట్ర స్వప్న సాకారానికి పోరాట పాఠాలు నేర్పిన బడి
నాది తెలంగాణ యుద్ధరాగాల్ని శాంతి గీతాల్ని రవళించే వీణ
అరవైఏండ్ల పరాయి పాలనలో గుండెలనిండా కన్నీటిధార
నిలువెత్తు గాయాలైనా నిలువుదోపిడిపై నిలిచి గెలిచిన రణధీర
ఉసిల్ల పుట్టలై ఉద్యమానికి ఊపిరులూదిన ముక్కోటి జనగానం
మట్టితల్లి విముక్తికోసం ప్రాణాలర్పించిన అమరుల త్యాగం
ఇది తెలంగాణ పోరాటాల తెగువ మడమతిప్పని నైజం నరనరాన
ఉబికివస్తున్న దుఃఖాన్ని గుండెలోతుల్లో దాచుకుని
జై తెలంగాణ నినాదాన్ని భుజానికెత్తుకుని
త్యాగాల పునాదుల మీద నిర్మించుకున్న ఆశల సౌధం
బంగారు తెలంగాణే లక్ష్యంగా చేసే ఆశయాల సేద్యం
మాది తెలంగాణ గమ్యం చేరేదాక ఆగని నిరంతర సాధన
పంటసిరులకు ఊతమిచ్చిన కాకతీయ, కాళేశ్వర జలధార
పుడమిపుత్రునికి రైతుబంధు, రైతుబీమాతో ఆసరా
బతుకు తెరువైన బడుగులకు పథకాల నజరాన
ఆదిలాబాద్ మొదలు హస్తిన వరకు స్ఫూర్తి తెలంగాణ
భారతావని కంతటికీ కావాలే ఈ నేల పాలన
మధుకర్ వైద్యుల
91827 77409
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

